జుట్టు తెల్లబడకుండా..
కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో కొన్ని తాజా కరివేపాకులు వేసి మరిగించాలి.
ఆధునిక జీవనంతో ముప్పై ఏండ్లకే జుట్టు నెరిసిపోతున్నది. దీంతో కృత్రిమ రంగులు వేసుకుంటారు.
ఆ రసాయనాలు పడకపోతే.. చర్మ సమస్యలు వస్తాయి. ఉన్న నాలుగు వెంట్రుకలూ ఊడిపోతాయి.
ఆ ఇబ్బంది లేకుండా, జుట్టు తెల్లబడటాన్ని సహజసిద్ధంగా అడ్డుకోవచ్చు.
కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో కొన్ని తాజా కరివేపాకులు వేసి మరిగించాలి. ఆ తర్వాత నూనె వడగట్టి జుట్టుకు పట్టించాలి. ముప్పై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. కుదుళ్లు బలపడతాయి. జుట్టుకు పోషణ అంది.. నెరిసిపోవడం ఆగుతుంది.
తగినంత కొబ్బరినూనెలో మూడు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించాలి. గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేస్తే సమస్య నియంత్రణలోకి వస్తుంది.
కొన్ని గోరింటాకులను కొబ్బరినూనె లేదా ఆవాలనూనెలో మరిగించాలి. తర్వాత, ఆ నూనెను తలకు పట్టించాలి. జుట్టును నల్లగా చేయడంలో గోరింట, ఆవాలు సాయపడుతాయి.
ముందుగా కరివేపాకును చూర్ణం చేసుకోవాలి. మెత్తని ముద్దలా చేసి, దానికి 1/4వ వంతు మజ్జిగ వేసి బాగా కలపాలి. అనంతరం ఆ ప్యాక్‌ను జుట్టుకు పట్టించాలి. కుదుళ్ల నుంచి చివరి వరకూ పట్టేలా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ చిట్కా జుట్టు నెరిసి
పోకుండా ఆపగలదు.
టేబుల్ స్పూన్ జామ లేదా ఉసిరి గుజ్జులో తగినంత నిమ్మరసం జోడించాలి. రెండూ బాగా కలిపి, తలకు పట్టించాలి. రాత్రంతా అలాగే ఉంచి.. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి.
మూడు టేబుల్ స్పూన్ల ఉల్లిరసంలో రెండుస్పూన్ల నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి మర్దన చేయాలి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే.. కేశ సమస్యలు తగ్గిపోతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

