న్యూఢిల్లీ : వింటర్ (Winter Vegetables) వచ్చీరాగానే ఉదయం, రాత్రి వేళల్లో వెన్నులో చలిపుట్టిస్తోంది. వాతావరణ మార్పులతో చిన్నా పెద్దా వయో వృద్ధులనే తేడా లేకుండా అన్ని వయసుల వారిలో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. మారుతున్న సీజన్‌తో జలుబు, జ్వరాలు, గొంతునొప్పి, దగ్గు వంటి పలు లక్షణాలు వేధిస్తున్నారు.
ఈ కాలంలో ఉష్ణోగ్రతలు, వాతావరణంలో ఊహించని మార్పులతో మన రోగనిరోధక వ్యవస్ద బలహీనమవడంతో పలు రకాల వైరస్లు, ఫ్లూలు విజృంభిస్తాయి. వాతావరణ మార్పులతో ఇమ్యూనిటీ బలహీనపడకుండా చూసుకునేందుకు ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
కూరగాయలు, పండ్లతో రోగనిరోధక వ్యవస్ధను బలోపేతం చేసుకోవడం ద్వారా సహజమైన జ్వరం, జలుబు వంటి అనారోగ్యాల బారినపడకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఈ హెల్తీ వింటర్ వెజిటబుల్స్‌తో ఇమ్యూనిటీని మెరుగుపరుచుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, సూక్ష్మ పోషకాలతో కూడిన ఈ కూరగాయలను ఈ సీజన్లో రెగ్యులర్‌గా తీసుకుంటే మేలు..
పాలకూర
క్యారట్
బ్రకోలి
ముల్లంగి
క్యాప్సికం
బీట్రూట్
క్యాలిఫ్లవర్
Read More :