Apps:
Follow us on:

Health Tips | ఫ్రిజ్‌లో నీళ్లు తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆలోచించండి!

1/8ఎండాకాలం వచ్చిందంటే చాలు ఫ్రిజ్‌లో వాటర్‌ బాటిల్స్‌తో నింపేస్తారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మాటిమాటికి చల్లటి నీరు తాగి గొంతును తడుపుకుంటుంటారు. చల్లటి నీళ్లు తాగడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది కానీ.. దీర్ఘకాలికంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
2/8ఆహారం తిన్న వెంటనే చల్లటి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల జీవక్రియపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. తద్వారా రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది.
3/8చల్లటి నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు కూడా వస్తాయి. దీనివల్ల కడుపు నొప్పి వస్తుంది.
4/8చల్లటి నీళ్లు గుండెలోని వాగస్‌ నరాలపై ప్రభావం చూపిస్తుంది. దీని ద్వారా గుండె పనితీరు నెమ్మదిస్తుంది.. హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే ఛాన్స్‌ కూడా ఉంటుంది. అందుకే హృద్రోగులు చల్లటి నీళ్లకు దూరంగా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తుంటారు.
5/8
చల్లటి నీరు తాగితే చిగుళ్ల నొప్పి వస్తుంది. దంతాలు వదులుగా మారే అవకాశం ఉంది. చల్లటి నీటిని తాగడం వల్ల గొంతులోని రక్షిత పొరపై ప్రభావం పడుతుంది.
6/8ఫ్రిజ్‌లోని నీటిని తాగడం వల్ల జలుబు చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి శ్వాసకోశ సమస్యలు కూడా ఎదురవుతాయి. వీటితో పాటు గొంతు ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయి.
7/8ఎండలో బయటకు వెళ్లి వచ్చిన వెంటనే చల్లటి నీరు తాగితే వెన్నెముకలోని నరాలు చల్లగా అవుతాయి. దీని ప్రభావం మెదడుపై పడుతుంది. తద్వారా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.
8/8బరువు తగ్గాలని అనుకునేవారు చల్లటి నీటికి దూరంగా ఉండటం మంచిది. చల్లటి నీరు తాగడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించడం కష్టమవుతుంది. పైగా కొవ్వు మరింత బలంగా మారడంతో అంత ఈజీగా బరువు తగ్గలేరు.