Constipation | మలబద్దకం వచ్చేందుకు అసలు కారణాలేంటి.. ఏం చేయాలి..?
మలబద్ధకం చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ జీర్ణ సమస్య. ఆహారంలో తగినంత పీచు లేకపోవడం, శరీరానికి అవసరమైనంత నీరు అందకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మలబద్ధకంతోపాటు కడుపు ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
Constipation | మలబద్ధకం చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ జీర్ణ సమస్య. ఆహారంలో తగినంత పీచు లేకపోవడం, శరీరానికి అవసరమైనంత నీరు అందకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మలబద్ధకంతోపాటు కడుపు ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ లేదా శారీరక చలనం తగ్గినప్పుడు ఈ సమస్య వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత ఆహారపు అలవాట్లు మలబద్ధకంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. కొన్ని ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడితే, మరికొన్ని ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.
కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలతో..
చీజ్, ఇతర పాల ఉత్పత్తులను మలబద్ధకానికి కారణమయ్యే ఆహారాల్లో ఒకటిగా పరిగణిస్తారు. వీటిలో కొవ్వు ఎక్కువగా ఉండటంతోపాటు పీచు పదార్థం ఉండదు. అలాగే కాల్షియం అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మందగించి మలం గట్టిపడే అవకాశం ఉంటుంది. తెల్ల బియ్యం, తెల్ల బ్రెడ్ వంటి శుద్ధి చేసిన ధాన్యాలలో పీచు ఎక్కువగా ఉండే బయటి పొరను తొలగిస్తారు. దీంతో జీర్ణవ్యవస్థలో మలం సులభంగా కదలడానికి అవసరమైన పీచు అందక మలబద్ధకం ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. చాక్లెట్లో ఉండే అధిక కొవ్వు, చక్కెర, పాల పదార్థాలు కొందరిలో జీర్ణక్రియను మందగించేలా చేస్తాయి. అలాగే శరీరంలో నీటి లోపాన్ని పెంచి మలబద్ధకానికి దారితీస్తుంది. అధికంగా వేయించిన పదార్థాలు, ఫాస్ట్ఫుడ్స్ కూడా మలబద్ధకానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. వీటిలో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల మలంలోని నీటి శాతం తగ్గి అది పొడిగా మారుతుంది. దీంతో మలం బయటకు వెళ్లడం కష్టమవుతుంది.
మద్యం సేవించినా..
పూర్తిగా పండని అరటిపండ్లలో రెసిస్టెంట్ స్టార్చ్, టానిన్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ వేగాన్ని తగ్గించి మలబద్ధకాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా పచ్చి అరటిపండ్లను కొన్నిసార్లు విరేచనాలను నియంత్రించేందుకు ఉపయోగిస్తారు. మద్యం అధికంగా తీసుకోవడం కూడా మలబద్ధకానికి దోహదం చేస్తుంది. మద్యం మూత్ర విసర్జనను పెంచి శరీరంలో నీటి లోపాన్ని కలిగిస్తుంది. ఈ నిర్జలీకరణ పరిస్థితి మలబద్ధకాన్ని మరింత పెంచుతుంది. మరోవైపు కొన్ని ఆహారాలు మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. కివీ పండు, అవిసె గింజలు, చిలగడదుంపలు, ప్రూన్స్, పాలకూర, ఓట్స్, బేరిపండ్లు, చియా గింజలు వంటి ఆహారాల్లో పీచు అధికంగా ఉంటుంది. ఇవి మలానికి పరిమాణాన్ని పెంచి, దానిని మెత్తగా మార్చి సులభంగా బయటకు వెళ్లేలా సహాయపడతాయి.
షైబర్ ఉండేలా చూసుకోవాలి..
కాఫీ కూడా కొందరిలో పేగుల కదలికలను ప్రేరేపించి మల విసర్జనను సులభతరం చేస్తుంది. అయితే ఇది వ్యక్తుల వారీగా మారుతుంది, కాబట్టి పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది. మలబద్ధకాన్ని నివారించాలంటే పీచు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, రోజంతా తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచి మలబద్ధకం సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Constipation
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

