Anti Oxidants | యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏమిటి.. ఇవి శరీరంలో ఏం చేస్తాయి.. ఎలా పొందాలి..?
ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జీవితకాలాన్ని పూర్తిగా నియంత్రించడం మన చేతుల్లో లేకపోయినా, ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం ద్వారా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
Anti Oxidants | ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జీవితకాలాన్ని పూర్తిగా నియంత్రించడం మన చేతుల్లో లేకపోయినా, ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం ద్వారా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల శరీర కణాలను రక్షించడంతోపాటు వయస్సు పెరుగుతున్న కొద్దీ వచ్చే అనేక ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలో వాపులను తగ్గించడం, కణాల పనితీరును మెరుగుపరచడం ద్వారా వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా కనిపించేందుకు కూడా తోడ్పడే అవకాశం ఉంటుంది.
నట్స్, పండ్లు, గింజలు..
డార్క్ చాక్లెట్, దానిమ్మ, గుమ్మడికాయ గింజలు, కొత్తిమీర, బ్లూబెర్రీస్, వివిధ రకాల నట్స్, రాజ్మా, క్రాన్బెర్రీస్, గోజీ బెర్రీస్, టమాటాలు వంటి ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని సమతుల ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వివిధ అవయవాలకు భిన్న రకాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తే, లైకోపీన్ పురుషుల ప్రోస్టేట్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఫ్లేవనాయిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. స్పిరులినా రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. అలాగే టీ, కాఫీల్లో ఉండే పాలీఫెనాల్స్ కొవ్వుల ఆక్సీకరణను తగ్గించి, శరీరంలో వాపులను నియంత్రించడంలో దోహదపడతాయి. నారింజ, బెర్రీస్ వంటి పండ్లలో విటమిన్ ఎ, సి, ఇ తోపాటు పాలీఫెనాల్స్, సెలీనియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
అల్లం, యాలకులు..
ఆయుర్వేదం ప్రకారం అల్లం అత్యంత ప్రయోజనకరమైన ఆహార పదార్థాల్లో ఒకటి. ఇందులో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది తోడ్పడుతుంది. యాలకులు కూడా ఆరోగ్యానికి మేలు చేసే సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. యాలకులతో తయారుచేసిన టీ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. శరీర వ్యవస్థలను శుభ్రంగా ఉంచుతుంది. వాము గింజలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే నియాసిన్, థైమాల్ వంటి పదార్థాలు గుండె పనితీరుకు తోడ్పడటంతోపాటు సహజ యాంటీబయోటిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.
తేనె..
తేనెను కూడా ఆయుర్వేదంలో అత్యుత్తమ సహజ ఆహార పదార్థంగా పరిగణిస్తారు. ఇందులో ఉండే సహజ ఖనిజాలు, జీవ ఎంజైమ్‌లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడి వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా కనిపించేందుకు కూడా కొంతవరకు దోహదపడతాయి. అయితే ఈ ఆహారాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయకారిగా ఉంటాయి గానీ, ఇవి ఏ వ్యాధికీ ప్రత్యామ్నాయ చికిత్స కావు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సిన వారు వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహాతోనే ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

