Eye tests | మీ కంటి పరీక్షలకు టైమైంది..! ఇవే హెచ్చరిక సంకేతాలు
Eye tests | కళ్లు మనకు దారి చూపేవే కాకుండా మనలో ఎలాంటి సమస్యలు రానున్నాయని కూడా మనకు హెచ్చిరక సంకేతాలు పంపుతుంది. ఈ సంకేతాలను మనం ఎప్పటికప్పుడు గమనించి వాటికి చికిత్స తీసుకోవడం ద్వారా పెద్ద సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
Eye tests | మనం ఎక్కువగా చర్మం, కేశాల ఆరోగ్యంపైనే శ్రద్ధ చూపుతుంటాం. ఇదే సమయంలో కంటి సంరక్షణను మరిచిపోతుంటాం. ఏదైనా కంటి సమస్య వచ్చినప్పుడు ఏదైనా డ్రాప్స్ వేసుకోవడం లేదంటే విశ్రాంతి తీసుకోవడం చేస్తుంటాం. అయితే, మన కళ్లు పరీక్షలకు సమయం దగ్గర పడిందని మనకు హెచ్చరిస్తుంటాయ్. ఈ హెచ్చరిక సంకేతాలను మనం లైట్‌గా తీసుకుంటుంటాం. కొన్ని సందర్భాల్లో కళ్ళలో నొప్పి, అసౌకర్యం కార్నియా, రెటీనాలో పెద్ద సమస్యలకు సంకేతం కావచ్చు. అలాకాకుండా ఈ హెచ్చరిక సంకేతాలను ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే హాయిగా కంటిని కాపాడుకోవచ్చు.
సడెన్ ఐ పెయిన్..
కళ్ళలో.. ఒకటి లేదా రెండింటిలో ఆకస్మిక నొప్పి వచ్చిన సందర్భాల్లో వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాల్సిన సమయమని గుర్తుంచుకోవాలి. కంటి నొప్పికి చాలా కారణాలు ఉండొచ్చు. అయితే, సీజన్లో మార్పు వల్ల వచ్చే చిన్నపాటి ఇన్ఫెక్షన్ నుంచి కార్నియల్ రాపిడి లేదా గ్లాకోమా వంటి తీవ్రమైన పరిస్థితుల వరకు చాలా నొప్పులు వస్తుంటాయి. కంటికి ఏదైనా గాయం అయినప్పుడు కూడా నొప్పి, వాపునకు దారితీస్తుంది.
లైట్ ఫ్లాష్‌లు..
మన కళ్ల ముందు అప్పుడప్పుడు లైట్ ఫ్లాష్‌లు కనిపిస్తుంటాయి. ఇలాంటివి కనిపించగానే కంటి నిపుణుడిని సంప్రదించాలని మరొక సంకేతం. ఈ ఫ్లాష్‌లు రెటీనాలో సమస్య ఉండవచ్చననే సంకేతం కావొచ్చు. రెటీనా వేరు చేయబడటం లేదా చిరిగిపోయే అవకాశం ఉన్న సమయాల్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి. ఇది దృష్టికి ఆటంకం కలిగిస్తుంది. ప్రారంభ దశలో రోగనిర్ధారణ చేస్తే దీనిని నివారించవచ్చు. అదేవిధంగా కంటి మైగ్రేన్ ఉన్నప్పుడు కూడా లైట్ ఫ్లాష్‌లు కనిపిస్తాయి.
లైట్ సెన్సిటివిటీ..
కళ్ళు అకస్మాత్తుగా కాంతికి సున్నితంగా మారినపక్షంలో కంటి లెన్స్ మబ్బుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది కంటి శుక్లం యొక్క సాధారణ సంకేతం. ఈ స్థితిలో కాంతి సున్నితత్వంతో పాటు అస్పష్ట దృష్టి, ఒక కంటిలో డబుల్ దృష్టి, రాత్రి అంధత్వం వంటి సమస్యలు రావచ్చు.
కంటామినెంట్స్..
మన కళ్ళు పర్యావరణంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి. అందుకని కళ్లు ధూళి, ఇతర సూక్ష్మ సహజ కణాలతో కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. ఈ చిన్న కణాలు కళ్లలోకి వచ్చినప్పుడు వాటిని కన్నీరు బయటకు పంపుతుంది. కానీ ప్లాస్టిక్, మెటల్ లేదా గాజు వంటి గట్టి కణాలు కళ్లలోకి ప్రవేశించి తీవ్రంగా కంటికి హాని కలిగిస్తాయి. కన్నీరు వాటిని తొలగించలేవు. ఇలాంటి సందర్భంలో వాటిని కళ్ళ నుంచి బలవంతంగా ఫ్లష్ చేయడం మంచిది కాదు. అందుకని వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
సడెన్ విజన్ లాస్..
ఆకస్మిక దృష్టి కోల్పోవడం అనేది ఒక తీవ్రమైన కంటి సమస్య. ఇది అనేక అంతర్లీన కారణాల వల్ల కావొచ్చు. ఇది స్ట్రోక్ ప్రారంభ సంకేతం కూడా కావచ్చు. రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడటం వలన స్ట్రోక్ వస్తుంది. ఇది మనల్ని పక్షవాతానికి గురి చేస్తుంది. మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. మరణం కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి.
ఫ్లోటర్స్..
ఫ్లోటర్స్ చిన్న మచ్చలు, వృత్తాలు, చుక్కల మాదిరిగా కనిపిస్తాయి. 60 లేదా 80 ఏండ్ల వయస్సులో ఉన్న చాలా మందిలో ఇవి కనిపిస్తాయి. ఇలాంటి వాటిని అకస్మాత్తుగా అనుభవిస్తే రెటీనా సురక్షితంగా, వేరుగా ఉందని నిర్ధారించుకోవడానికి కంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
చివరగా..
కంఇ రెప్పల్లో తరచూ దురద వస్తుంటే కళ్ల చుట్టూ సమస్య ఉందనడానికి సంకేతంగా భావించాలి. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేయడం వల్ల కళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. కళ్ల మంటగా అనిపించినా, కంటి నుంచి ఏకధాటిగా నీరు కారుతున్నా ఏమాత్రం అలక్ష్యం చేయకుండా కంటి వైద్య నిపుణుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాల్సిందే.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

