Vitamin B12 Deficiency | విటమిన్ బీ12 లోపం అధిగమించాలంటే..!
శరీరం సజావుగా పనిచేయాలంటే తగినంత విటమిన్ బీ12 లెవెల్స్ (Vitamin B12 Deficiency) ఉండటం అత్యవసరం. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, నరాల పనితీరుకు విటమిన్ బీ12 తగినంతగా ఉండాలి.
న్యూఢిల్లీ : శరీరం సజావుగా పనిచేయాలంటే తగినంత విటమిన్ బీ12 లెవెల్స్ (Vitamin B12 Deficiency) ఉండటం అత్యవసరం. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, నరాల పనితీరుకు విటమిన్ బీ12 తగినంతగా ఉండాలి. బీ12 లోపం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విటమిన్ బీ12 లోపిస్తే నీరసం, తీవ్ర అలసట, దైనందిన పనులను నిర్వర్తించలేకపోవడం, ఉత్పాదకత దెబ్బతినడం వంటివి తలెత్తుతాయి. చర్మం పాలిపోయినట్టు కనిపిస్తుంది.
ఎర్ర రక్తకణాల తయారీ తగ్గిపోవడంతో శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా చేసే సామర్ధ్యం తగ్గిపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రేవుల సామర్ద్యం తగ్గిపోవడంతో అజీర్తి, మలబద్ధకం, డయేరియా వంటి సమస్యలు చుట్టుముడతాయి. నాడీ వ్యవస్థ పనితీరుకు విటమిన్ బీ12 ముఖ్యమైనది.
బీ12 లోపం వల్ల చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, సూదితో గుచ్చిన అనుభూతి కలుగుతుంది. కుంగుబాటు, హృద్రోగ ముప్పునకు విటమిన్ బీ12 లోపం దారితీస్తుంది. విటమిన్ బీ12 లెవెల్స్ మెరుగుపడాలంటే బీ12 అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. మాంసం, చేపలు, సీఫుడ్, పాల ఉత్పత్తులు, గుడ్లు, సిరిల్స్ అధికంగా తీసుకోవాలి. బీ12 సప్లిమెంట్లు, ఇంజక్షన్లను వైద్యుల సూచన మేరకు తీసుకోవాలి. శాకాహారులు, వెగాన్స్, వయో వృద్ధులు తరచూ బీ12 పరీక్షలు చేయించుకోవాలి.
Read More :
Raw Coconut | తరచూ పచ్చికొబ్బరి తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా..?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

