న్యూఢిల్లీ : ఆరోగ్యకరమైన ఒత్తైన వెంట్రుకలు (Healthy Hair) కావాలని కోరుకోని వారుండరు. కొందరికి సహజంగా ఒత్తైన జుట్టు వస్తే మరికొందరు అందుకోసం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. కేశ సంపద పెంచుకునేందుకు చాలామంది కేశ సంరక్షణ ప్రోడక్ట్స్‌పై పెద్దమొత్తంలో ఖర్చు చేస్తుంటారు.
అయితే కృత్రిమ ప్రోడక్ట్స్‌ను వాడటం కంటే సహజ ఉత్పత్తులు, పదార్ధాలతో ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆహార పదార్ధాలతో మన వెంట్రుకల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. గుడ్ల నుంచి తృణధాన్యాలు, పాలకూర వంటి ఎన్నో ఫుడ్స్ కేశ సంరక్షణకు ఉపయోగపడతాయి. ఎగ్స్ ఆరోగ్యకరమైన కేశ సంపదను సమకూరుస్తాయి.
ఎగ్స్‌లో ఉండే విటమిన్ ఏ, ఈ, బయోటిన్, ఫోలెట్ ఒత్తైన జుట్టుతో మెరిసేలా చేస్తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం, లేదా హెయిర్ మాస్క్‌లా వాటిని అప్లై చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఒత్తైన కేశాలను పొందాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలాంటే..
ఎగ్స్
నట్స్
పాలకూర
ఉసిరి
డైరీ ప్రోడక్ట్స్
Read More :