న్యూఢిల్లీ : ఐఫోన్స్‌లో సిలికాన్ ఫోన్ కవర్స్‌ను వాడటాన్ని యాపిల్ నిలిపివేయనుంది. పర్యావరణ అనుకూల న్యూ ఫైన్వోవెన్ను ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌లో వాడనుంది. యాపిల్ వాచ్ సిరీస్ యాక్సెసరీలు, ఇతర యాక్సెసరీలకూ ఫైన్వోవెన్ మెటీరియల్ వాడకాన్ని అనుసరించనుంది. 2030 నాటికి తన ప్రోడక్ట్స్ అన్నింటినీ కార్బన్ రహితంగా చేసేందుకు యాపిల్ సంసిద్ధమైంది.
ప్రతి యాపిల్ ప్రోడక్ట్‌ను క్లీన్ ఎనర్జీతో, రీసైకిల్డ్, రెన్యూవబుల్ మెటీరియల్స్‌తో రూపొందించేందుకు టెక్ దిగ్గజం కసరత్తు సాగిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా సిలికాన్ రబ్బర్, ఫ్లోరోఎలాస్టమర్ యాక్సెసరీస్ స్ధానంలో పర్యావరణ అనుకూల నెక్ట్స్ జనరేషన్ మెటీరియల్స్‌తో రీప్లేస్ చేయనుంది. ఐఫోన్ సిలికాన్ కేసులతో సహా సిలికాన్ యాక్సెసరీల వాడకాన్ని నిలిపివేసి ఫైన్వోవెన్ మెటీరియల్‌ను వాడేందుకు యాపిల్ కసరత్తు సాగిస్తోందని యాపిల్ డివైజ్ కలెక్టర్, లీకర్, మ్యాక్రూమర్స్కు చెందిన కొసుటమి వెల్లడించారు.
గతంలో లెదర్ యాక్సెసరీస్‌ను నిలిపివేసిన యాపిల్ ప్రస్తుతం పర్యావరణహిత మెటీరియల్స్‌ను ప్రోత్సహించే క్రమంలో సిలికాన్ ప్రోడక్ట్స్‌కు స్వస్తిపలకనుంది. యాపిల్ సిలికాన్ రబ్బర్ యాక్సెసరీలు లెదర్‌తో పోలిస్తే తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేసినా వాటిలో ఎలాంటి రీసైకిల్డ్ మెటీరియల్స్ వాడటం లేదు. రానున్న ఐఫోన్ 15 సిరీస్‌లో ప్రీమియం ఐఫోన్ కేసుల్లో ఫైన్వోవెన్ను యాపిల్ ప్రవేశపెట్టనుంది. వీటిని మ్యాగ్‌సేఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ క్లాత్ లెదర్స్గా వ్యవహరిస్తారు.
Read More :
Drugs | షాద్‌నగర్‌లో డ్రగ్స్ విక్రయం.. మహిళతో పాటు ఇద్దరు అరెస్ట్