న్యూఢిల్లీ : వర్షాకాలంలో సాధారణ జలుబు, దగ్గు, జ్వరం, ఇన్ఫెక్షన్ల నుంచి శ్వాసకోశ వ్యాధుల (Respiratory Infections) వరకూ వెంటాడుతుంటాయి. వైరల్ వ్యాధులకు దూరంగా ఆరోగ్యంగా ఉండాలని అనుకునే వారు తగు జాగ్రత్తలు పాటిస్తే ఈ సీజన్లో ఆయా వ్యాధులకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పారిశుద్ధ్య పరిస్ధితులు సరిగ్గా లేకపోవడంతో పాటు వ్యాధి నివారణ చర్యలు చేపట్టక పోవడం వల్ల వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయని వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా చాలావరకూ ఈ వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.
వర్షాకాలం రావడంతో వ్యాధులను ముందుగానే పసిగడితే తీవ్ర అనారోగ్యాల బారినపడకుండా జాగ్రత్త పడవచ్చు. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల ముప్పు తప్పాలంటే ఈ సూచనలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ముఖాన్ని తాకకుండా జాగ్రత్తలు
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
తగినంత నీరు తీసుకోవాలి
మాస్క్ ధరించాలి
రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలి
ఆరోగ్యకరమైన ఆహారం
Read More :
Weight Loss | అధిక బరువుతో బాధపడుతున్నారా..? చాట్ జీపీటీతో ఇక నో వర్రీ..!