Neck Pain | మెడ నొప్పితో ఇబ్బందులా..? ఇలా తొలగించుకోండి..!
Neck Pain | పనిలో ఉన్నప్పుడు మనం అప్పుడప్పుడు మెడ నొప్పితో బాధపడుతుంటాం. మెడ నొప్పే కదా అని లైట్ తీసుకుంటే వేరే ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదమున్నది. అందుకే మెడ నొప్పిని తొలగించుకునే చర్యలపై దృష్టిసారించడం అవసరం.
Neck Pain | ఎక్కువ సమయం పాటు మొబైల్‌పై గడిపినా, ట్యాప్టాప్పై 10 గంటలకు పైగా పనిచేసినా మెడ నొప్పి రావడం మనం చూస్తుంటాం. ముందుముందు ఇది వెన్నుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మన రోజువారీ చర్యలే మెడ నొప్పులకు కారణమవుతుంటాయి. సరైన భంగిమలో కూర్చోకపోవడం, నిద్ర లేకపోవడం వంటివి మెడ నొప్పులను మరింత పెంచుతాయి. అలాగే, ఆర్థరైటిస్, డిస్క్ వ్యాధి వచ్చే ప్రమాదముంటుంది. వీటన్నింటి నుంచి బయటపడాలంటే మెడ నొప్పిని దూరం చేసుకోవడం ఒక్కటే మార్గం.
మెడ నొప్పులను లైట్ తీసుకొని అదే తగ్గుతుందిలే అనే పొరపాటు చేయవద్దు. మెడ నొప్పి అంతకంతకూ పెరుగుతుంది కానీ తగ్గదని గుర్తుంచుకోవాలి. చేస్తున్న పనిని వదిలి నిద్రలోకి జారుకుంటే కానీ ఆ నొప్పి వదలదు. కొందరు నొప్పిని భరిస్తూనే పని చేస్తుంటారు. ఇది ఎంతమాత్రమూ మంచిది కాదని సూచిస్తున్నారు వైద్యనిపుణులు. ఆ నొప్పి ఎందుకు వస్తుందో గుర్తించి తగు నివారణ చర్యలు పాటించకపోతే ఇతర ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
తరచూ భంగిమలు మార్చడం..
మనం కూర్చునే విధానం సరిగ్గా లేకపోతే మెడ నొప్పి వస్తుంది. ఏకధాటిగా కూర్చుని పనిచేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని పని మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. సరైన భంగిమలో కూర్చునేలా కుర్చీని అడ్జస్ట్ చేసుకోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఎక్కువ సమయం పాటు మొబైల్ చూడకుండా ఉండాలి. మెడ నిటారుగా ఉంచి పని చేయడం అలవాటు చేసుకోవాలి.
ఎర్గోనామిక్ సర్దుబాట్లు..
మెడపై పెరిగే ఒత్తిడి నొప్పిని కలిగించకుండా ఉండేందుకు కొన్ని సర్దుబాట్లు అవసరం. వైర్డ్ హెడ్ఫోన్లు ఉపయోగించకుండా చూసుకోవాలి. తరచుగా తలను కిందికి వంచకుండా ఉండేందుకు హ్యాండ్స్ ఫ్రీ లేదా బ్లూటూత్ ఇయర్‌ప్లగ్‌లను వాడాలి. మెడ నిటారుగా ఉండేందుకు ల్యాప్‌టాప్ లేదా డెస్క్టాప్ను కంటి స్థాయిలో ఉంచుకోవాలి.
అదనపు దిండు వాడొద్దు..
చాలా మందికి పడుకున్నప్పుడు, సోఫాలో కూర్చుని పనిచేస్తున్నప్పుడు దిండ్లు ఎక్కువగా వాడుతుంటారు. మెడ కింద ఎక్కువగా దిండ్లు పెట్టుకోవడం చెడు అలవాటు. ఈ అలవాటు వల్ల మెడ నొప్పి వస్తుండటమే కాకుండా తర్వాతి రోజుల్లో వెన్నునొప్పి సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. మెడ గట్టిగా మారి నొప్పిని కలిగిస్తుంది.
బరువైన వస్తువులు ఎత్తొద్దు..
మనలో చాలా మంది ఇంట్లో పని చేస్తూ బరువైన వస్తువులను ఎత్తుతుంటాం. ఒకేసారి బరువులు ఎత్తడం వల్ల మెడపై ప్రభావం పడుతుంది. ఫలితంగా మెడ నొప్పి వస్తుంది. ఇలాంటి సమస్య నుంచి బయటపడేందుకు ఎక్కువ బరువులు ఎత్తకుండా చూసుకోవాలి.
బాగా నిద్రోవాలి..
నిద్ర సరిగా లేని వారిలో కూడా మెడ నొప్పి కనిపిస్తుంది. మెడ నొప్పి రాకుండా ఉండాలంటే కంటి నిండా నిద్ర ఉండాలి. తగినంత నిద్రలేకపోతే మానసిక కల్లోలం, చికాకు, బద్దకం, పగలు నిద్రపోవడం, నొప్పులకు దారితీస్తుంది. మెడ నొప్పి నుంచి నివారణకు తగినంత విశ్రాంతి పొందేలా, మంచి నిద్ర కలిగేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
రెగ్యులర్‌గా యోగా, ఎక్సర్సైజ్ వంటివి చేస్తూ ఉండాలి.
రోజూ కనీసం గంటైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకోవాలి.
ప్రతి రెండు గంటలకు ఓసారి కూర్చున్న చోటు నుంచి లేచి నడవాలి.
మెడ నొప్పి కనిపించగానే మెడను రొటేట్ చేసే వ్యాయామాలు చేయాలి.
ఐస్ థెరపీ, హీట్ థెరపీ ద్వారా మెడ నొప్పిని తగ్గించుకోవచ్చు.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

