ఈ ఆహారం.. ఎముకలకు బలం
ఓ వ్యక్తి దృఢత్వానికి ఎముకల సామర్థ్యమే కొలమానం. అయితే, వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల సత్తువ క్రమంగా తగ్గిపోతుంది. ఒక్కోసారి బోలువ్యాధి కూడా ఎముకలను బలహీన పరుస్తుంది. కాబట్టి, ఎముకలకు బలాన్నిచ్చే ఆహారాన్ని పళ్లెంలో చేర్చుకోవాలి.
- ఓ వ్యక్తి దృఢత్వానికి ఎముకల సామర్థ్యమే కొలమానం. అయితే, వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల సత్తువ క్రమంగా తగ్గిపోతుంది. ఒక్కోసారి బోలువ్యాధి కూడా ఎముకలను బలహీన పరుస్తుంది. కాబట్టి, ఎముకలకు బలాన్నిచ్చే ఆహారాన్ని పళ్లెంలో చేర్చుకోవాలి.
- పాలు, జున్ను, పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తుల్లో క్యాల్షియం అధికం. ఎముకల బలోపేతానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి, రోజూ
పాల ఉత్పత్తులు తీసుకోవాలి. - చేపల్లో ముఖ్యంగా ట్యూనా ఫిష్లో ఒమేగా-3 ఆమ్లాలు, విటమిన్-డి సమృద్ధిగా ఉంటాయి. మనం తీసుకునే క్యాల్షియంతో కూడిన ఆహారం ప్రభావ
వంతంగా పనిచేయడానికి విటమిన్-డి అవసరం. చేపలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎముకలను దృఢంగా ఉంచుతాయి. - గుమ్మడి గింజలను సలాడ్స్లో జోడించుకోవచ్చు. ఇవి వెన్నెముకను బలోపేతం చేస్తాయి. గుమ్మడి విత్తనాల్లోని ఖనిజాలు.. ఆహారంలోని క్యాల్షియంను ఎముకలు గ్రహించడంలో సాయపడతాయి.
- ఎరుపురంగు క్యాప్సికంలో విటమిన్-సి పుష్కలం. ఇది ఎముకల్లో కొలాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సాయపడుతుంది. చిట్లిన ఎముకలను నయం చేయడంలో, విరిగిన ఎముకల చివరలను కలపడంలో సహకరిస్తుంది.
- గుడ్లలో విటమిన్-డితో పాటు కొద్ది మోతాదులో క్యాల్షియం లభిస్తుంది. ప్రొటీన్, విటమిన్-బి మాత్రం అధికంగానే ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఎముకలను బలోపేతం చేసేవే. కాబట్టి, రోజూ ఉడకబెట్టిన గుడ్డు తినాలని సలహా ఇస్తారు పోషకాహార నిపుణులు.
- బ్లాక్బీన్స్ ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని మెగ్నీషియం, ప్రొటీన్లు ఎముకల కణజాలాన్ని శక్తివంతం చేస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- bones
- Food
- strong for bones
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

