లండన్ : ప్రాసెస్డ్ ఆహారం, అధికంగాఉప్పు, చక్కెర కలిసిన పదార్ధాలు తీసుకోవడం, శారీరక వ్యాయామం కొరవడటంతో వయసుతో నిమిత్తం లేకుండా కొలెస్ట్రాల్ సమస్య ఇప్పుడు పలువురిని వేధిస్తోంది. కొవ్వు పేరుకుపోవడం క్రమేణా గుండె పోటు, స్ట్రోక్ వంటి అనర్ధాలకు దారితీస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఆలివ్ ఆయిల్ మెరుగ్గా పనిచేస్తుందని హార్వర్డ్ హెల్త్ సహా పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఆలివ్ ఆయిల్లో చెడు కొలెస్ట్రాల్‌ను సమర్ధంగా తగ్గించే మోనోఅన్శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ 75 శాతం వరకూ ఉంటాయి.
ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, యాంటీఇన్ప్లమేటరీ ఔషధాలు గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆలివ్ ఆయిల్‌ను సలాడ్‌పై వేసుకోవడంతో పాటు రోజూ చేసుకునే కూరల్లో వాడటంతో పాటు తినుబండారాలను ఈ నూనెతో తయారుచేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆలివ్ ఆయిల్‌తో పాటు కూరగాయలు, గుడ్లు, పండ్లు వంటి సమతులాహారం తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.