Iron deficiency | ఐరన్ లోపంపై పోరాటమా? ఈ 5 బ్రేక్‌ఫాస్ట్‌లను ట్రై చేయండి..!
Iron deficiency | ముఖ్యంగా ఐరన్ లోపంతో పోరాటం చేస్తున్న వారైతే ఉదయం వేళ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లపై దృష్టి పెట్టాలి. ఐరన్ సమృద్ధిగా లభించేందుకు 5 రకాల బ్రేక్‌ఫాస్ట్‌లను ట్రై చేద్దాం.
Iron deficiency | కొవిడ్ కారణంగా మనమంతా కొన్నాళ్లపాటు ఇళ్లకే అతుక్కుపోయాం. మనం తీసుకునే ఆహారాల్లో మార్పులు వచ్చాయి. ఆరోగ్యకరమైనవి కాకుండా అందుబాటులో ఉన్నవి తిన్నాం. తింటున్నాం. మన జీవనశైలిలో వచ్చిన ఆకస్మిక మార్పులు మన శరీరాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఈ లోపాలను అధిగమించడానికి పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా ఐరన్ లోపంతో పోరాటం చేస్తున్న వారైతే ఉదయం వేళ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లపై దృష్టి పెట్టాలి. ఐరన్ సమృద్ధిగా లభించేందుకు 5 రకాల బ్రేక్‌ఫాస్ట్‌లను ట్రై చేద్దాం.
శనగలతో పరాటాలు

శనగల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో సులభంగా లభిస్తుంది. రుచికరమైన స్టఫ్డ్ పరాఠాను సిద్ధం చేసుకోవడానికి నానబెట్టిన శనగలను వాడాలి. అదనపు రుచిని అందించడానికి మసాలాలు, కొన్ని కూరగాయలను కలపడం మరిచిపోవద్దు.
గుమ్మడికాయ రసం

గుమ్మడికాయలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో కూడా ఇనుము అధికంగా లభిస్తుంది. గుమ్మడికాయను ముక్కలుగా కోసి గ్రైండ్ చేసి సిద్ధం చేసుకున్న రసాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తాగడం ద్వారా ఐరన్ లోపాన్ని నివారించుకోవచ్చు. దీనికి రుచిగా కొంచెం తేనె కలిపి కూడా తీసుకోవచ్చు.
నువ్వులు- అవిసె గింజ స్మూతీ

నువ్వులు-అవిసె గింజల్లో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్‌తో పాటు పలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొంచెం పాలు, తేనె, అవిసె గింజలు, నువ్వులను బ్లెండర్లో వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేయాలి. ఇలా చేసిన స్మూతీని నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో ఇనుము స్థాయిలు పెరుగుతాయి.
పాలకూర పాన్కేక్

పాలకూర పాన్‌కేక్‌ను సాధారణంగా షుగర్, మైదాతో తయారు చేస్తారు. అయితే, ఇది ఆరోగ్యపరంగా మంచిది కాదు. అందుకని గోధుమ పిండిని బచ్చలికూర పేస్ట్, గుడ్లు, పెరుగు, మసాలాలతో కలిపి పాన్కేక్ తయారుచేసుకోవచ్చు. ఈ రుచికరమైన వంటకాన్ని కనీసం 15 రోజులకు ఒకసారైన తీసుకున్నట్లయితే శరీరంలో ఐరన్ లోపాన్ని సరిదిద్దుకోవచ్చు.
సోయా అటుకులు

సోయాబీన్లో పోషకాలు అధికంగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరం బరువును తగ్గించడంలో సహాయపడుతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌లో అధికంగా ఉంటుంది. సోయా అటుకులకు ఉల్లి గడ్డ తురుము, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర తురుముకు నిమ్మరసం కలిపి బ్రేక్‌ఫాస్ట్‌గానే కాకుండా సాయంత్రం వేళ స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

