Parenting Tips | డెలివరీ తర్వాత మరో బిడ్డను కనేందుకు ఎంత గ్యాప్ తీసుకోవాలి?
Parenting Tips | నమస్తే డాక్టర్. నా వయసు ముప్పై మూడు. ఆరు నెలల పాప ఉంది. పెళ్లయిన ఏడాదికి పుట్టింది. సిజేరియన్ డెలివరీ. వయసు పెరుగుతున్నది కాబట్టి, త్వరలో మరో బిడ్డను కనాలని అనుకుంటున్నాం. ఇప్పటి నుంచే ప్రయత్నించవచ్చా?
Parenting Tips | నమస్తే డాక్టర్. నా వయసు ముప్పై మూడు. ఆరు నెలల పాప ఉంది. పెళ్లయిన ఏడాదికి పుట్టింది. సిజేరియన్ డెలివరీ. వయసు పెరుగుతున్నది కాబట్టి, త్వరలో మరో బిడ్డను కనాలని అనుకుంటున్నాం. ఇప్పటి నుంచే ప్రయత్నించవచ్చా?
– ఓ పాఠకురాలు
అది సిజేరియన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా.. ప్రసవానికి, మళ్లీ గర్భం ధరించడానికి మధ్య కనీసం పద్దెనిమిది నెలల వ్యవధి ఉండాలి. ఈ నియమం తల్లీ బిడ్డలు ఇద్దరికీ మంచిది. ఒకసారి బిడ్డకు జన్మనిచ్చాక తల్లి శరీరం పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఏడాదిన్నర పడుతుంది. అలా కాకుండా ముందుగానే గర్భం ధరిస్తే శరీరానికి మరో బిడ్డను మోసే శక్తి ఉండదు. నెలలు నిండకుండానే ప్రసవం కావడం, తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం లాంటివి జరుగుతాయి.
అంతేకాదు, బిడ్డకు రకరకాల ఆరోగ్య సమస్యలూ రావచ్చు. తొలి బిడ్డకు పాలిస్తూనే, మరో బిడ్డను మోయడం వల్ల తల్లికి రక్తం సరిపోక ఎనీమియా రావచ్చు. అలాగే ఎడం పాటించకుండా గర్భం ధరించడం వల్ల తొలిబిడ్డకు కనీసం ఏడాది, ఏడాదిన్నర పాటు పాలు పట్టే అవకాశం ఉండదు. దీంతో బిడ్డ మీద సరిగా శ్రద్ధ పెట్టలేరు. కడుపులోని పాపాయే కాదు, పుట్టిన బిడ్డా ఆరోగ్యంగా ఎదగలేదు. కాబట్టి, మీరు తప్పకుండా ఈ ఎడం పాటించండి.
డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

