Jeera Paachak Goli | జీరాతో అజీర్తి సమస్యలకు చెక్
దేశీ వంటిళ్లలో కనిపించే జీలకర్ర (Jeera Paachak Goli) వంటకాలకు అద్భుత రుచిని అందించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనూ చేకూరుస్తుంది.
న్యూఢిల్లీ : దేశీ వంటిళ్లలో కనిపించే జీలకర్ర (Jeera Paachak Goli) వంటకాలకు అద్భుత రుచిని అందించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనూ చేకూరుస్తుంది. పప్పులు, రైతాలు, కూరలు, సూప్స్ సహా ఎన్నో డిష్‌లలో జీలకర్ర లేదా జీలకర్ర పొడిని వాడటం ద్వారా ఆయా వంటకాల టేస్ట్ పెరుగుతుంది. ఇక జీరాలో జీర్ణక్రియను పెంపొందించే గుణాలు ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్‌కు ఇంట్లో పెద్దవారు జీలకర్ర, బ్లాక్‌సాల్ట్‌ను కలిపిన మిశ్రమాన్ని తాగి ఉపశమనం పొందుతుంటారు.
ఇక భోజనం చేసిన తర్వాత జీలకర్రతో చేసిన గోళీలను చప్పరిస్తే గ్యాస్, అసిడిటీ, కడుపుబ్బరం, వికారం వంటి సమస్యలు దరిచేరవని చెబుతారు. జీరా పచక్ గోళీగా పిలిచే ఈ పిల్‌ను రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. జీలకర్రలో జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన ఎంజైమ్స్‌ను ప్రేరేపించే ఔషధ గుణాలున్నాయి. వీటితో పాటు ఫైబర్, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి అత్యవసర పోషకాలు ఉన్నాయి. అందుకే చాలామంది ఉదయాన్నే జీలకర్ర వేసిన నీటిని ఖాళీ కడుపుతో తాగుతుంటారు.
మరికొందరు బరువు తగ్గేందుకు కూడా ఈ పానీయాన్ని తరచూ తీసుకుంటారు. కడుపు నొప్పి, అజీర్తి, డయేరియా వంటి సమస్యలను జీరా పానీయంతో అధిగమించవచ్చని చెబుతుంటారు. ఇక జీరా గోళీలను తయారుచేసే విధానం పరిశీలిస్తే..జీలకర్ర, బ్లాక్‌పెప్పర్, రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, లెమన్ సాల్ట్, మామిడి పొడి, పౌడర్డ్ షుగర్ల మిశ్రమంతో గోళీలను తయారుచేసుకుని రోజూ భోజనం తర్వాత వాటిని చప్పరిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
Read More :
Udhayanidhi Stalin | సనాతన ధర్మంపై అభ్యంతర వ్యాఖ్యలు.. ఉదయనిధికి షాకిచ్చిన సుప్రీంకోర్టు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

