Curry Leaves | పరిగడుపున కరివేపాకు తినొచ్చా?
Health Benefits of Curry Leaves | కూరకు మంచివాసన తోడవ్వాలంటే పోపులో కరివేపాకు పడాల్సిందే. కానీ కంచంలో కనపడితే మాత్రం, చాలామంది తీసి పక్కన పెట్టేస్తారు. నిజానికి కరివేపాకులోని పోషకాలు ఆరోగ్యానికి, అందానికి ఎంతో అవసరం.
› కరివేపాకు చర్మ సౌందర్యానికి, కేశ సౌందర్యానికి ఉపయోగపడుతుంది. తరచూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోజూ భోజనానికి ముందు ఒక ముద్ద అన్నంలో కొద్దిగా కరివేపాకు పొడి వేసుకుని తినాలని చెబుతారు పెద్దలు. కరివేపాకును పచ్చళ్లు, కూరలు, వేపుళ్లు, సలాడ్స్‌లోనూ వేసుకుని తినవచ్చు.
› కరివేపాకులో విటమిన్-ఎ, విటమిన్-సి, పొటాషియం, క్యాల్షియం, ఫైబర్, కాపర్, ఐరన్ తదితర పోషకాలు పుష్కలం. ఆహారంలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్, గ్లూకోజ్ నియంత్రణలో ఉంటాయి. కంటిచూపు మెరుగుపడుతుంది.
› రోజూ పరగడుపునే నాలుగు కరివేపాకు నమలడం వల్ల మలబద్ధకం, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.
› కరివేపాకును ఆయుర్వేద ఔషధాల్లోనూ వినియోగిస్తారు. దీనిలోని యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హెపటో ప్రొటెక్టివ్ లక్షణాల వల్ల శరీరానికి రక్షణ లభిస్తుంది.
› కరివేపాకు కుదుళ్లను పటిష్ఠపరిచి, జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. దీనిలోని పోషకాలు జుట్టు తెల్లబడటం, చివర్లు చిట్లడం తదితరసమస్యలను తగ్గిస్తాయి. గాయాలు మానడంలోనూ ఉపయోగపడుతుంది.
Read More :
ఆడవాళ్లకు జీడిపప్పు ఏవిధంగా మేలు చేస్తుందో తెలుసా!”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

