పొగ తాగుతున్నారా? ఊపిరితిత్తుల క్యాన్సర్ తప్పదు
‘జీవి నిరంతరం తీసుకునేది ఏదైనా ఉందా?’ అని ఆలోచిస్తే అది శ్వాస మాత్రమే. ఆహారం, నీరు లేకుండా కొన్ని రోజులు బతకవచ్చు.
‘జీవి నిరంతరం తీసుకునేది ఏదైనా ఉందా?’ అని ఆలోచిస్తే అది శ్వాస మాత్రమే. ఆహారం, నీరు లేకుండా కొన్ని రోజులు బతకవచ్చు. కానీ శ్వాస తీసుకోకుండా నిమిషమైనా బతకలేం. నిద్రపోతున్నా శ్వాస తీసుకుంటాం. ఈ క్రమంలో గాలి నుంచి ఆక్సీజన్ తీసుకుని, కార్బన్-డై-ఆక్సైడ్ బయటకు వదులుతాం. ఈ ప్రక్రియనంతా మన ఊపిరితిత్తులు చేస్తాయి. 2.3 కిలోగ్రాముల బరువు ఉండే ఊపిరితిత్తులు ఎడమ వైపు రెండు లోబ్స్(గదులు)గా, కుడివైపు మూడు లోబ్స్గా విభజించబడి ఉంటాయి.
ఎలాస్టిక్ సంచుల్లా ఉండే ఈ ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న బుడగల్లాంటివి 300 మిలియన్లకు పైగా ఉంటాయి. వీటివల్ల ఊపిరితిత్తులు నీటిలో తేలతాయి. మన శరీరంలోని అవయవాలన్నిటిలో నీటిలో తేలే అవయవాలు ఊపిరితిత్తులు మాత్రమే. అందుకనే నీటిలో ఈతకొట్టే వాళ్లు ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకోవడం వల్ల మునిగిపోకుండా తేలతారు. ఇంతటి ప్రాముఖ్యత గల ఊపిరితిత్తులు కొన్ని మానవ తప్పిదాల వల్ల క్యాన్సర్ బారినపడుతున్నాయి. అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్, టీబీ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. చాలామంది ఒకదానికొకటిగా పొరబడి కొన్ని సందర్భాల్లో సరైన చికిత్స చేయించుకోలేకపోతున్నారు. అప్పుడు అది క్యాన్సర్ అయితే వ్యాధి తగ్గక పోగా తీవ్రమవుతుంది. టీబీ అయితే ఇతరులకు సోకే ప్రమాదముంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు:
ఇతర క్యాన్సర్ల మాదిరిగానే ఊపిరితిత్తుల్లోనూ కణాలు అపరిమితంగా పెరగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న క్యాన్సర్ మరణాలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలే అధికం. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలలోనే లంగ్ క్యాన్సర్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. మొన్నటి వరకు పురుషులే ఎక్కువగా ఈ వ్యాధి బారినపడేవాళ్లు. కానీ, కల్చర్ మారుతున్నందువల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడే మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. ఊపిరి
తిత్తుల క్యాన్సర్‌కి ప్రధాన కారణం ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకం. ఒకప్పుడు పొగతాగేవాళ్లలో మగవాళ్లే ఎక్కువ. అందుకే వారిలో లంగ్ క్యాన్సర్ ఎక్కువగా ఉండేది. కానీ, నేటి మహిళల్లో పొగతాగేవాళ్లు పెరిగినట్లే ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడే మహిళలు కూడా పెరుగుతున్నారు.
ఒక్కసారి పొగ తాగినా రంగు మారుద్ది:
ఒక్కసారి పొగ తాగితే 4 వేల రకాల రసాయనాలు, 60కి పైగా క్యాన్సర్ కారకాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. వీటి వల్ల పొగ మానేసిన తర్వాత కూడా లంగ్ క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉంది. పొగ తాగే వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ ముప్పు తప్పదు. ధూమపానం చేసే వారితోపాటు రేడాన్ గ్యాస్, ఆస్బెస్టాస్ కంపెనీల్లో పనిచేసే వాళ్లకూ లంగ్ క్యాన్సర్ ముప్పు ఎక్కువ. ఇతర క్యాన్సర్లతో పోల్చితే లంగ్ క్యాన్సర్‌కి వ్యాపించే గుణం ఎక్కువ. లంగ్ క్యాన్సర్ త్వరగా శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి బారినపడ్డ రోగులు ఎక్కువ రోజులు బతికే అవకాశాలు చాలా తక్కువ.
లంగ్ క్యాన్సర్ లక్షణాలు:
- ఊపిరి పీల్చుకోవడం ఇబ్బంది
- విపరీతమైన దగ్గు, దగ్గుతో పాటు రక్తం పడటం
- ఆకలి, బరువు తగ్గడం
- అలసటగా ఉండడం, త్వరగా నీరసించిపోవడం
- ఛాతిలో, పొట్టలో నొప్పి
- ఆహారం మింగడంలో ఇబ్బంది
లంగ్ క్యాన్సర్ కారకాలు:
ఊపిరితిత్తుల క్యాన్సర్ 3 రకాలు
- స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (ఎస్.సి.ఎల్.సి)
- నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (ఎన్.ఎస్.సి.ఎల్.సి)
- ఇతర అవయవాలకు సోకిన క్యాన్సర్ ఊపిరితిత్తులకు వ్యాపించడం
వ్యాధి నిర్ధారణ పరీక్షలు:
లంగ్ క్యాన్సర్ ఉన్నట్లు అనుమానిస్తే ఛాతి ఎక్స్-రే, బయాప్సీ టెస్ట్ చేయాలి. ఆ రిపోర్టుల ఆధారంగా సీటీ-స్కాన్, పెట్ సీటీ స్కాన్ పరీక్షలు చేయాలి. వీటితో పాటు స్పైరోమెట్రి, బ్రాంకోస్కోపి, రక్త పరీక్షలు కూడా చేయాలి. ఈ పరీక్షల ద్వారా వ్యాధి ఏ స్టేజ్‌లో ఉంది?, వ్యాధి ఊపిరితిత్తుల్లో ఎంత భాగం విస్తరించిందో నిర్ధారించవచ్చు. వ్యాధినిబట్టి చికిత్స ఉంటుంది.
చికిత్సా పద్ధతులు:
ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే, లోబెక్టమి చేసి లంగ్‌లో క్యాన్సర్ సోకిన భాగాన్ని తొలగించవచ్చు. నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్‌కి మాత్రమే సర్జరీ ద్వారా చికిత్స చేసే వీలుంది. స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్‌కి వ్యాపించే గుణం ఉంది. కాబట్టి దీనికి రేడియోథెరపి, కీమోథెరపీ చికిత్స చేయాలి. సర్జరీ చేసినా ఈ థెరపిలు చేయాల్సిన అవసరం ఉంటుంది.
– డాక్టర్ మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ 98490 22121
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
Ramayana | రామాయణకు భారీ స్పందన.. ఒక్కరోజులోనే 36 వేలకి పెరిగిన అడ్వాన్స్ బుకింగ్స్!
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

