Health Tips | ఒకేసారి లీటరు కొబ్బరి నీళ్లు తాగొచ్చా? కిడ్నీల మీద ఏమైనా భారం పడుతుందా!
Health Tips | శరీరంలో ద్రవాల స్థాయిని నియంత్రణలో ఉంచేందుకు, ఎలక్ట్రోలైట్లను సమతౌల్యం చేసేందుకు కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. సోడియం, పొటాషియం, మాంగనీసులాంటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బకు, డయేరియాకు కొబ్బరినీళ్లు మంచి మందు.
Health Tips | ఎండాకాలం దాహం కోసమో, ఆరోగ్యానికి మంచిదనో కొబ్బరి నీళ్లు తాగుతుంటాం. అయితే ఇటీవల బోండాలతోపాటు బాటిళ్లలోనూ కొబ్బరి నీళ్లను అమ్ముతున్నారు. ఇలా ఒకేసారి లీటరు కొబ్బరి నీళ్లు తాగొచ్చా? దీనివల్ల కిడ్నీల మీద ఏమైనా భారం పడుతుందా! అసలు ఒక రోజులో, లేదా వారంలో ఎన్ని కొబ్బరి నీళ్లు తాగొచ్చు తెలియజేయండి?
- ఓ పాఠకురాలు
శరీరంలో ద్రవాల స్థాయిని నియంత్రణలో ఉంచేందుకు, ఎలక్ట్రోలైట్లను సమతౌల్యం చేసేందుకు కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. సోడియం, పొటాషియం, మాంగనీసులాంటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బకు, డయేరియాకు కొబ్బరినీళ్లు మంచి మందు. పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుండె జబ్బులు, బీపీ ఉన్నవాళ్లకు మంచిది. ఇందులో ఉండే మీడియం చెయిన్ ట్రై గ్లిజరైడ్లు చర్మానికి, జుట్టుకి మేలు చేస్తాయి. జీర్ణశక్తికి కూడా ఉపయోగపడతాయి.
పొటాషియం శరీరంలోని విషతుల్యాలను బయటికి నెట్టేసేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి కిడ్నీలకు కూడా మంచివి. అంతేకాదు కొబ్బరినీళ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, మినరళ్లు పోను 95 శాతం మంచి నీళ్లే ఉంటాయి. 20-40 ఏండ్ల మధ్య వయసున్న వాళ్లు రోజుకు లీటరు కొబ్బరినీళ్లు తాగొచ్చు. యాభై ఏండ్లు పైబడిన వాళ్లు ఏ ఇతర ఆరోగ్య సమస్యలు లేకపోతే చక్కగా వీటిని తాగొచ్చు. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్లు మాత్రం రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను బట్టి తీసుకోవాలి. కాబట్టి, న్యూట్రీషనిస్టులను సంప్రదించి దానికి తగ్గట్టు తీసుకోవడం మంచిది.
– మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@ gmail.com
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

