Health Tips | నోటి పరిశుభ్రత పాటించకపోతే మెదడు ఆరోగ్యంపై ప్రభావం
నోటి పరిశుభ్రతపై శారీరక ఆరోగ్యం ఆధారపడిఉంటుందని వైద్య నిపుణులు చెబుతుండగా తాజాగా నోటి పరిశుభ్రత మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.
న్యూయార్క్ : నోటి పరిశుభ్రతపై శారీరక ఆరోగ్యం ఆధారపడిఉంటుందని వైద్య నిపుణులు చెబుతుండగా తాజాగా నోటి పరిశుభ్రత మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. నోటి పరిశుభ్రత సరిగ్గా లేకుంటే మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. నోటి పరిశుభ్రత, ఆరోగ్యంపై తక్షణం దృష్టి సారించడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మెరుగైన మెదడు ఆరోగ్యానికి అవసరమని అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ నిర్వహించే ఇంటర్నేషనల్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ 2023లో సమర్పించనున్న అధ్యయనం వెల్లడించింది. చిగుళ్ల వ్యాధి, నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోవడానికి స్ట్రోక్ ముప్పు పెరిగేందుకు మధ్య సంబంధాన్ని అధ్యయనాలు సూచించాయి. ఎంఆర్ఐ ద్వారా ఈ రెండింటి మధ్య సంబంధాన్ని ఇప్పుడు మనం పసిగట్టవచ్చని అధ్యయన రచయిత, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన సిప్రిన్ రివిర్ తెలిపారు.
హృద్రోగం, స్ట్రోక్ తరహాలోనే మెదడు ఆరోగ్యం కూడా జీవనశైలి, అలవాట్లపై ఆధారపడి ఉంటుందని, దంతాలు, చిగుళ్లను శుభ్రంగా ఉంచుకోవడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. 2014, 2021 మధ్య 4000 మంది పెద్దలపై నోటి పరిశుభ్రత, మెదడు ఆరోగ్యం మధ్య సంబంధంపై పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అధ్యయనంలో పాల్గొన్న వారికి ఎంఆర్ఐ ఇమేజ్‌ల ద్వారా మెదడు ఆరోగ్యాన్ని ఆరా తీశారు. దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు ఉన్న వారిలో మెదడుకు రక్తసరఫరాను నిరోధించే సైలెంట్ సెరిబ్రొవాస్క్యులర్ వ్యాధిని పరిశోధకులు గుర్తించారు. ప్రజలు నోటి పరిశుభ్రతను విధిగా పాటించాలని, ప్రాణాంతక వ్యాధులకు ఇది దారితీయకుండా చూసుకోవాలని పరిశోధకులు కోరుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Health news
- oral hygiene
- Study
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

