న్యూఢిల్లీ : వెయిట్ ట్రైనింగ్‌తో అధిక బరువును తగ్గించుకోవచ్చని (Health Tips)నిపుణులు చెబుతున్నారు. ర్యాపర్ బాద్షా తన వెయిట్ లాస్ ప్రయాణంతో కూడిన వీడియోలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయడంతో వెయిట్ ట్రైనింగ్ ప్రాధాన్యతపై మళ్లీ పలువురు ప్రస్తావిస్తున్నారు. వెయిట్ ట్రైనింగ్‌తోనే తాను బరువు తగ్గి పర్ఫెక్ట్ ఫిజిక్ సాధించగలిగానని ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ర్యాపర్ బాద్షా చెప్పుకొచ్చారు.
రీల్ వీడియోలో అతను వెయిట్ ట్రైనింగ్, భుజాల ఎక్సర్సైజులు చేస్తూ కనిపించారు. ఈ వర్కవుట్‌లో కండరాలు పటిష్టం కావడంతో పాటు బరువు తగ్గడంలోనూ ఇది కీలకంగా వ్యవహరిస్తుందని ర్యాపర్ చెప్పుకొచ్చారు. క్యాలరీలను భారీగా బర్న్ చేయడంతో కొవ్వు కరిగే ప్రక్రియ ఊపందుకుంటుంది. మరోవైపు జీవక్రియల వేగం పెరగడం ద్వారా బరువు తగ్గడం వేగవంతమవుతుంది.
వెయిట్ ట్రైనింగ్‌తో ఫ్లెక్సిబిలిటీ మెరుగవుతుంది. కండరాలను కదిలించడం ద్వారా జాయింట్ల కదలిక మెరుగుపడుతంది. వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజులతో ఎముకలు బలంగా, గట్టిగా తయారవుతాయి. వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ల ద్వారా కొలెస్ట్రాల్, బీపీ అదుపులో ఉండటంతో పాటు రక్త ప్రసరణ మెరుగవడంతో ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Read More :
Jowar benefits | బీపీ, షుగర్ రోగులు బేఫికర్‌గా ఉండాలంటే.. డైలీ డైట్లో ఈ చిరుధాన్యం ఉండాల్సిందే..