Jowar benefits | బీపీ, షుగర్ రోగులు బేఫికర్‌గా ఉండాలంటే.. డైలీ డైట్లో ఈ చిరుధాన్యం ఉండాల్సిందే..
Health Tips | మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు ఎక్కువగా చిరుధాన్యాలనే ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దాంతో చిరుధాన్యాల డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.
Jowar benefits | జీవనశైలి రోగాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఈ రోజుల్లో చిరుధాన్యాలకు ఎక్కడలేని ప్రాధాన్యం ఏర్పడింది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు ఎక్కువగా చిరుధాన్యాలనే ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దాంతో చిరుధాన్యాల డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా కొర్రలు, అరికలు, జొన్నలు, రాగులు, సామలు, సజ్జలు వంటి వాటి వినియోగం ఎక్కువైంది. వీటన్నింటిలో అత్యంత ప్రయోజనకరమైనవి, ధర పరంగా చూసినా అగ్గువకు లభ్యమయ్యేవి జొన్నలు మాత్రమే. మరి జొన్నలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందామా..?
జొన్నలతో ప్రయోజనాలివి..
1. జొన్నలతో చేసే ఏ వంటకమైనా బలవర్ధకమైనదే. ఎందుకంటే బియ్యం, గోధుమలతో పోల్చితే జొన్నల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
ఇది ఎముకల పటిష్టతకు తోడ్పడుతుంది.
2. గోధుమ పిండి, బియ్యం పిండితో చేసే రొట్టెలతో పోల్చితే జొన్న పిండితో చేసే రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిది. జొన్న రొట్టెలు సులువుగా జీర్ణమవుతాయి. అదేవిధంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉండదు. జొన్న గటక, జొన్న జావ, జొన్న అన్నం ఇలా ఏ రకంగా తీసుకున్నా జొన్నలతో మేలే జరుగుతుంది.
3. జొన్నల్లో ఐరన్, ప్రోటీన్లు, పీచు పదార్ధాల్లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. లిపిడ్స్ ఉండవు. కాబట్టి జొన్నలవల్ల ఒంట్లోగానీ, రక్తంలోగానీ కొవ్వు పెరిగే ప్రమాదం ఉండదు. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. జొన్నల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటంవల్ల జీర్ణశక్తి పెంపొందుతుంది.
4. అదేవిధంగా ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ జొన్నల్లో పుష్కలంగా ఉంటాయి. ఎముకలను బలిష్టంగా ఉంచేందుకు కావాల్సిన ఫాస్పరస్ కూడా జొన్నల్లో లభిస్తుంది. అందుకే నరాల బలహీనతను తగ్గించే గుణం కూడా జొన్నలకు ఉంది.
5. పైగా రోజూ జొన్నలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడంవల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వయసు పెరిగేకొద్దీ వచ్చే మతిమరుపు, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలకు కూడా జొన్నల వినియోగంతో పరిష్కారం లభిస్తుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

