న్యూఢిల్లీ : భారత్ లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తికి కారణమని చెబుతున్న డెల్టా వేరియంట్ పై రష్యా కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ సమర్ధంగా పనిచేస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. భారత్ లో తొలుత గుర్తించిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్ పై ఫలితాలు ప్రచురించిన ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే స్పుత్నిక్ వీ అత్యధిక ప్రభావవంతంగా పనిచేస్తుందని గమలేయ సెంటర్ స్టడీ పేర్కొంది.
అంతర్జాతీయ జర్నల్ లో ప్రచురించేందుకు అథ్యయన వివరాలను సమర్పించినట్టు ట్వీట్ చేసింది. మరోవైపు కరోనా వైరస్ డెల్టా వేరియంట్ నుంచి ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రెండు డోసులు రక్షణ కల్పిస్తాయని లాన్సెట్ జర్నల్ నివేదిక పేర్కొంది. ఇక డెల్టా వేరియంట్ మ్యుటేషన్ డెల్టా ప్లస్ ఆందోళనకరమైనదని నిర్థారణ కాలేదని, దీనిపై అధ్యయనం చేపడతామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.