Health Tips | స్ప్రింగ్ ఆనియన్స్‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
ఉల్లిగడ్డలు వివిధ వంటకాలకు రుచిని ఇవ్వడంతో పాటు మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు (Health Tips) అందిస్తాయి. రెడ్ ఆనియన్స్‌తో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ వాడకం కూడా ఇటీవల పెరిగింది. ఆసియన్ వంటకాల్లో స్పింగ్ ఆనియన్స్ విరివిగా వాడుతున్నారు.
న్యూఢిల్లీ : ఉల్లిగడ్డలు వివిధ వంటకాలకు రుచిని ఇవ్వడంతో పాటు మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు (Health Tips) అందిస్తాయి. రెడ్ ఆనియన్స్‌తో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ వాడకం కూడా ఇటీవల పెరిగింది. ఆసియన్ వంటకాల్లో స్పింగ్ ఆనియన్స్ విరివిగా వాడుతున్నారు. గుండ్రటి ఎర్ర ఉల్లిపాయలుగా పరిణితి చెందక మునుపు వీటిని స్ప్రింగ్ ఆనియన్స్గా పిలుస్తారు. ఇవి కొంచెం తీయగా ఉండటంతో పాటు ప్రత్యేకమైన ఫ్లేవర్‌ను కలిగిఉంటాయి.
చిల్లీ చికెన్, ఫ్రైడ్ రైస్, నూడుల్స్ వంటి రెసిపీల్లో వీటిని వాడితే రెస్టారెంట్ స్టైల్‌తో కూడిన డిష్‌లతో పాటు మంచి రుచిని ఆస్వాదించవచ్చు. ఇక స్ప్రింగ్ ఆనియన్స్ టేస్ట్‌ను జోడించడమే కాదు మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తాయి. వీటిలో ఉండే సల్ఫర్ కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమబద్ధీకరించడంలో సాయపడతాయి. మధుమేహ ముప్పును నివారించడంతో పాటు స్ప్రింగ్ ఆనియన్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో ఇవి మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తాయి.
వీటిని వివిధ వంటకాల్లో వేసుకోవడం ద్వారా లేదా నేరుగా వాటిని తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. స్ర్పింగ్ ఆనియన్స్‌తో కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. వీటిలో ఉండే కరోటినాయిడ్స్ వల్ల కంటి ఆరోగ్యం బాగుపడుతుంది. వీటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉండటంతో కంటిచూపు మందగించడాన్ని నివారిస్తుంది. స్ప్రింగ్ ఆనియన్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బీపీని నియంత్రించి హృద్రోగ ముప్పును నివారిస్తాయి. వీటిలో ఉండే యాంటీ వైరల్ గుణాలు ఫ్లూ, ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Read More :
Emotion | ఎమోషన్స్ మీద పట్టు సాధించాలంటే…..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

