Health Tips | ఈ సింపుల్ బ్రేక్‌ఫాస్ట్‌తో పొట్టను తగ్గించుకోండి..!
ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేసినా అధిక పొట్టను (Health Tips) తగ్గించుకోలేకపోతున్నామని పలువురు వాపోతుంటారు. సింపుల్ బ్రేక్‌ఫాస్ట్‌తో పొట్టలో కొవ్వును ఇట్టే కరిగించేయవచ్చని ప్రముఖ డైటీషియన్ మన్‌ప్రీత్ కల్రా చెబుతున్నారు.
న్యూఢిల్లీ : ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేసినా అధిక పొట్టను (Health Tips) తగ్గించుకోలేకపోతున్నామని పలువురు వాపోతుంటారు. సింపుల్ బ్రేక్‌ఫాస్ట్‌తో పొట్టలో కొవ్వును ఇట్టే కరిగించేయవచ్చని ప్రముఖ డైటీషియన్ మన్‌ప్రీత్ కల్రా చెబుతున్నారు. ఉదయం ఆహారంలో అధిక ప్రొటీన్ తీసుకోవడం ద్వారా అధికంగా ఆహారం తీసుకునేందుకు కళ్లెం వేయవచ్చు.
అధిక క్యాలరీలు, చక్కెర, ప్రాసెస్డ్ పదార్ధాలను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడంతో శరీరంలో కొవ్వులు అధికంగా చేరే ప్రమాదం ఉంది. తక్కువ క్యాలరీలతో పాటు పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని అల్పాహారంగా తీసుకోవడం మేలు. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం ఆకలిని తగ్గించడంతో పాటు శరీరంలో జీవక్రియలను వేగవంతం చేసి బరువు తగ్గే ప్రక్రియకు దారితీస్తుంది.
కార్బోహైడ్రేట్లు తక్కువగా ప్రొటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండటంతో పాటు పొట్ట తగ్గేందుకు ఇది ఉపకరిస్తుంది. ఉదయాన్నే వేరుశనగ పప్పు, స్ర్పౌట్స్తో కూడిన పోహా, ఉప్మా, గోధుమపిండి, మిల్లెట్స్‌తో చేసిన పరాట, పల్లీ చట్నీతో దోసె, ఇడ్లీ, ఎగ్ వంటి ఆహార పదార్ధాలను అల్పాహారంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు మన్‌ప్రీత్ కల్రా సూచిస్తున్నారు.
Read More :
అమ్మమ్మల కాలం నాటి సలహాలే ఇప్పటి బిజినెస్ ఐడియాలు!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

