దీర్ఘాయువు రహస్యం!
life | కొందరు శతమానం జీవించడానికి కారణం? మంచి ఆహారపు అలవాట్లు, సకాలంలో వైద్యం, మానసిక ప్రశాంతత లాంటి కారణాలు వినిపిస్తాయి.

కొందరు శతమానం జీవించడానికి కారణం? మంచి ఆహారపు అలవాట్లు, సకాలంలో వైద్యం, మానసిక ప్రశాంతత లాంటి కారణాలు వినిపిస్తాయి. వీటితోపాటు మరో ముఖ్యకారణం ‘జన్యువులు’. కొందరి జన్యువులు దీర్ఘాయువుకు అనువుగా ఉండటం వల్లే సునాయసంగా సెంచరీ కొడుతున్నారు.
ఇది ఎంతవరకు నిజం? ‘సుదీర్ఘమైన ఆయుర్దాయానికి జన్యువులు ఎలా తోడ్పడతాయి?’ అనే సందేహం ఇటలీలోని కొందరు పరిశోధకులకు వచ్చింది. ఈ రహస్యాన్ని శోధించేందుకు వాళ్లు 105 సంవత్సరాలకు పైబడిన వృద్ధులనుంచి రక్త నమూనాలు సేకరించారు. వాటిని విశ్లేషించి జన్యుపటం తయారుచేశారు. అదే సమయంలో 60 ఏండ్ల సగటు వయసు ఉన్న మరి కొందరి జన్యుపటాలనుకూడా సేకరించారు.
ఈ రెండిటినీ గమనించినప్పుడు COA1, STK17A అనే రెండు జన్యువులు ఇరువయసుల వారిలోనూ చురుగ్గా ఉన్నట్టు తేలింది. వయసు మళ్లే కొద్దీ మనలోని జన్యువులుకూడా దెబ్బతింటాయి. వాటిని సరిచేసే వ్యవస్థసైతం దెబ్బ తినడం వల్ల ఆ నష్టం శాశ్వతంగా ఉండిపోతుంది. కానీ, పైన పేర్కొన్న ఈ రెండు జన్యువులూ ఎప్పటికప్పుడు దెబ్బతిన్న జన్యువులు మరింతగా నష్టపోకుండా కాపాడుతున్నట్లు గుర్తించారు. వయసు మళ్లిన తర్వాతకూడా ఇవి క్రియాశీలంగా ఉంటే వృద్ధాప్యపు ఛాయలు తగ్గుతాయి. ఎవరికి తెలుసు? రానున్న కాలంలో వీటిని సరిచేసే అవకాశం కూడా వస్తుందేమో!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

