రోజూ బీరు తాగితే మెదడుకు ముప్పు : తాజా అధ్యయనం
ఆరోగ్యంగా జీవించాలంటే మద్యానికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. వైన్ పరిమితంగా తీసుకుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించినా వైద్యులు మద్యం తీసుకోమని సూచించడం అరుదు.
లండన్ : ఆరోగ్యంగా జీవించాలంటే మద్యానికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. వైన్ పరిమితంగా తీసుకుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించినా వైద్యులు మద్యం తీసుకోమని సూచించడం అరుదు. అయితే విస్కీ, బీరు, వోడ్కా వంటివి ఆరోగ్యానికి హానికరమేనని చెబుతుంటారు. మద్యం దుష్ర్పభావాలపై పలు అధ్యయనాలు ఎన్నో విషయాలు వెల్లడించాయి.
ఇక తాజా అధ్యయనం ప్రకారం నిత్యం బీరు తీసుకుంటే మెదడు పదేండ్లు వయసు మీరుతుందని వెల్లడైంది. బీరు తాగడం మెదడు ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేసేందుకు సంబంధం ఉందని నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టంచేసింది. 36,000 మంది బ్రైన్ స్కాన్స్, వారి డ్రింకింగ్ హ్యాబిట్స్‌ను పరిశీలించిన మీదట అధ్యయనం ఈ వివరాలు వెల్లడించింది. రోజుకు రెండు సార్లు బీరు తీసుకునే 50 ఏండ్లు పైబడిన వారి మెదడు ఈ అలవాటు లేని వారితో పోలిస్తే పదేండ్లు వయసుమీరిందని పరిశోధనలో వెల్లడైంది.
రోజుకు ఒక పింట్ బీరును తీసుకునే వారిలో బ్రెయిన్ రెండేండ్ల పాటు వయసు పెరిగినట్టు గుర్తించారు. మెదడులో ఉండే గ్రే, వైట్ మ్యాటర్ మద్యంతో ప్రభావితమవుతుందని పరిశోధనలో కనుగొన్నారు. బీరును తీసుకోవడం మరింత కాలం కొనసాగిస్తే మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధ్యయనం హెచ్చరించింది. దీర్ఘకాలం బీరు తాగితే కాలేయం వంటి కీలక అవయవాలూ దెబ్బతినే ప్రమాదం ఉంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

