Sanitary Pads | ఆడాళ్లూ జర జాగ్రత్త..? శానిటరీ ప్యాడ్స్‌తో ఆరోగ్య సమస్యలు..!
ఆడవాళ్లు ప్రతినెలా వినియోగించే శానిటరీ ప్యాడ్స్‌తో వారి ఆరోగ్యం చెడిపోతున్నది. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Sanitary Pads | గతంలో రుతుచక్రం కోసం ఇంట్లోనే పాత వస్త్రాలను వినియోగించేవారు. ఆధునిక కాలంలో శానిటరీ ప్యాడ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా మహిళల్ని చుట్టుముట్టాయంటున్నారు నిపుణులు. మహిళలు తమ జీవితంలో దాదాపు 1800 రోజులపాటు రుతుచక్రాన్ని కలిగి ఉంటారు. ఈ లెక్కన ఒకరు తన జీవితకాలంలో దాదాపు 40 వేల ప్యాడ్లను ఉపయోగిస్తారని అంచనా. మహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకుని పలు కంపెనీలు ఈ ప్యాడ్లకు మృదుత్వం, ఇతర కార్యాచరణను మెరుగుపర్చేందుకు సింథటిక్ ప్లాస్టిక్ పదార్థాలను వినియోగిస్తున్నారు. ఇది చాలా హానికరమని, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకు హానికరం..?
మన మార్కెట్లలో దొరికే అన్ని రకాల శానిటరీ ప్యాడ్ల తయారీలో థాలేట్స్, అస్థిర కర్బన సమ్మేళనాలు (వొలాటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ – వీఓసీ) వంటి విషపూరిత రసాయనాలు వాడుతున్నారు. ఫ్లెక్సిబిలిటీ, పారదర్శకత, ఎక్కువ కాలం మన్నిక కోసం థాలేట్స్‌ను కలుపుతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్సీబీఐ) ప్రకారం.. థాలేట్స్ అనేది యుక్తవయస్సులో శరీరంలో మార్పులను ప్రేరేపిస్తుంది. క్యాన్సర్, సంతానోత్పత్తి లోపాలకు కారణం అవుతుంది. టెస్టిక్యులర్ డిస్జెనిసిస్ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. మగవారు, మహిళలు ఇద్దరిలోనూ దీని వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుంది. శానిటరీ ప్యాడ్ల తయారీలో ఎక్కువ మొత్తంలో వాడుతున్న రసాయనాలు అండాశయ, రొమ్ము క్యాన్సర్లను మోసుకొస్తాయంటున్నారు నిపుణులు. ఈస్ట్రోజెన్ వంటి స్త్రీ హార్మోన్లను ప్రభావితం చేయడం ద్వారా అవి చివరికు క్రమరహిత ఋతుస్రావం వంటి సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు సెలవిస్తున్నారు.
ఎలా తెలిసిందంటే..
శానిటరీ ప్యాడ్లలో రసాయనాలు మరీ ముఖ్యంగా వీఓసీలు ఉండే అవకాశం గురించి మొదటిసారిగా 2014 లో విమెన్స్ వాయిస్ ఫర్ ఎర్త్ గ్రూప్ నివేదించింది. ప్రముఖ బ్రాండ్ శానిటరీ ప్యాడ్లలో విషపూరితమైన స్టైరిన్, క్లోరోఫామ్, క్లోరోమీథేన్ సమ్మేళనాలు అధిక మొత్తంలో ఉన్నట్లు హెచ్చరించింది. అనంతరం 2017 లో ఒక దక్షిణ కొరియా అధ్యయన నివేదిక కూడా శానిటరీ ప్యాడ్లలో వీఓసీల అధిక స్థాయిల్లో ఉన్నట్లు పేర్కొన్నది. సదరు కంపెనీపై మహిళా సంఘం దావా కూడా వేసింది. అయితే, నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే (ఎన్హెచ్ఏఎన్ఈఎస్) 2001-2004 డాటాను ఉపయోగించి జరిపిన ఒక అధ్యయనం 20-49 సంవత్సరాల వయస్సు మధ్య గల మహిళల్లో యోని డౌచింగ్ ఫ్రీక్వెన్సీ – 1,4-డైక్లోరోబెంజీన్ రక్త సాంద్రతల మధ్య గణాంకపరంగా సానుకూల సహసంబంధాన్ని నివేదించింది. ఈ ప్రత్యేక సమ్మేళనం క్యాన్సర్లకు కారణమవుతుందని పరిశోధకులు ఇదివరకే తేల్చారు.
ఇవీ ఆరోగ్య సమస్యలు..
రుతుక్రమ ఉత్పత్తుల్లో సువాసన, మృదుత్వం, యాడ్సోర్బెంట్లు, అథెస్సీవ్స్గా, బైండర్‌గా వీఓసీలను ఉపయోగిస్తుంటారు. అలాగే తాజాదనం అనుభూతిని సృష్టించేందుకు ఎక్కువ మొత్తంలో వీఓసీలను జతచేస్తారు. వీఓసీలలో వాడే బెంజీన్ క్యాన్సర్ కారకంగా నిరూపితమైంది. 1,4-డయాక్సేన్ సంభావ్య కార్సినోజెన్, నాఫ్తలీన్ కార్సినోజెన్. శానిటరీ ప్యాడ్లలో కనిపించే వీఓసీల వల్ల కళ్ళు, ముక్కు, గొంతుపై ఇరిటేషన్ వస్తుంది. వికారం, అలసట, సమన్వయం కోల్పోవడం, మైకం కమ్మడం వంటివి సంభవించవచ్చు. కాలేయం, మూత్రపిండాలు, కేంద్ర నాడీ వ్యవస్థకు హాని కలిగించవచ్చు. శానిటరీ ప్యాడ్స్‌తో పర్యావరణానికి కూడా హానికరమని అధ్యయనాల్లో తేలింది. వీటిని కాల్చివేయడం ద్వారా వీటిలో ఉండే రసాయనాలు గాలిలోకి విషపూరితమైన డయాక్సిన్, ప్యూరాన్లను విడుదల చేస్తాయి.
ఇలా సురక్షితంగా వాడాలి..
పెరినియల్ ఇన్ఫెక్షన్ల అవకాశాలను తగ్గించుకోవడానికి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
పెరినియల్ పరిశుభ్రతను పాటించాలి. సువాసనలతో కూడిన ప్యాడ్లను వాడకుండా చూసుకోవాలి. రేపర్లపై కోట్ చేసే సేంద్రీయ వంటి పదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దురద, ఎరుపు వంటి పెరినియల్ ఇన్ఫెక్షన్ వస్తున్నట్లుగా సూచించే సంకేతాలను గమనిస్తూ ఉండాలి. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తగానే వెంటనే వైద్యుడ్ని సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

