హాస్పిటల్ థీమ్ రెస్టారెంట్‌కు ఆన్లైన్లో షాక్ : ఫ్రీ ఫుడ్ ఆఫర్‌పై నెటిజన్లు ఫైర్
హాస్పిటల్ థీమ్‌తో అమెరికాలో నడిపిస్తున్న రెస్టారెంట్‌కు ఆన్లైన్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 158 కిలోల కంటే ఎక్కువ బరువున్న వారికి ఉచితంగా ఆహారం అందిస్తామనే రెస్టారెంట్ ఆఫర్ వికటించింది.
న్యూయార్క్ : హాస్పిటల్ థీమ్‌తో అమెరికాలో నడిపిస్తున్న రెస్టారెంట్‌కు ఆన్లైన్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 158 కిలోల కంటే ఎక్కువ బరువున్న వారికి ఉచితంగా ఆహారం అందిస్తామనే రెస్టారెంట్ ఆఫర్ వికటించింది. ఈ ఆఫర్‌కు తాము అర్హులమో, కాదో తెలుసుకునేందుకు లాస్ వెగాస్‌లోని హార్ట్ ఎటాక్ గ్రిల్ ఎదుట పలువురు కస్టమర్లు బారులుతీరిన ఫొటోలు టిక్‌టాక్, ఇతర సోషల్ మీడియా వేదికలపై కనిపించడంతో నెటిజన్లు రెస్టారెంట్‌ను ఓ రేంజ్లో ఆడుకున్నారు.
గత కొన్నేండ్లుగా హార్ట్ ఎటాక్ గ్రిల్ తమదైన స్పెషల్ థీమ్‌తో రెస్టారెంట్‌ను నడిపిస్తోంది. ఈ రెస్టారెంట్ క్యాలరీలు, కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్ధాలను విక్రయిస్తుంది. ఈ రెస్టారెంట్ ఐటెమ్‌లు కొన్ని సింగిల్, డబుల్, ట్రిపుల్, క్వాడ్రపుల్, క్వింటుపల్, ఆక్టుపుల్ బైపాస్‌గా ఆర్డర్లు అందుబాటులో ఉంటాయి. పలు రెస్టారెంట్లు వినియోగదారులను కస్టమర్లు, పోషకులుగా వ్యవహరిస్తే, హార్ట్ ఎటాక్ గ్రిల్ మాత్రం తమ కస్టమర్లను హాస్పిటల్ థీమ్‌కు అనుగుణంగా రోగులుగా పిలుస్తుంది.
ఈ రెస్టారెంట్లో వెయిట్రెస్ నర్సులుగా, వెయిటర్లు డాక్టర్లుగా వ్యవహరిస్తారు. ఆర్డర్ ఇచ్చే ముందు ప్రతి పేషెంట్ హాస్పిటల్ గౌన్, రిస్ట్‌బ్యాండ్ ధరించాలి. ఇక స్ధూలకాయులకు ఉచితంగా అనారోగ్యకర ఫాస్ట్‌ఫుడ్‌ను ఆఫర్ చేయడంపై రెస్టారెంట్ తీరును ట్విట్టర్ యూజర్లు తప్పుపట్టారు. కొవ్వుతో కూడిన ఆహార పదార్ధాలను పెద్దమొత్తంలో తినేందుకు ప్రజలను ఆహ్వానించి వారిని అనారోగ్యాల బారిన పడేస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. 2005లో ఈ థీమ్ రెస్టారెంట్ ప్రారంభమైనప్పటి నుంచి దాని వినూత్న మార్కెటింగ్ వ్యూహం వివాదాస్పదమైంది.
Read More :
Health Tips | డాక్టర్ల వార్నింగ్‌తో 165 కిలోల బరువు తగ్గాడు..!
Jay Shetty | డిగ్రీ అవ్వగానే సన్యాసం…
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- buzz
- Food
- Restaurant
- viral news
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

