Heart attack | జిమ్ చేస్తున్నప్పుడు గుండెపోటు.. కారణమిదే?
జిమ్ చేస్తుండగా గుండెపోటు వచ్చి ఇటీవల కొందరు సెలబ్రిటీలు కన్నుమూశారు. తాజాగా, హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ్‌కు ఢిల్లీలోని జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటు రావడంతో దవాఖానకు తరలించారు. వైద్యులు అతడిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ అతని పరిస్థితి విషమంగానే ఉంది. ఇటీవల ఇలాంటి కేసుల సంఖ్య పెరగడం తీవ్రమైన వ్యాయామాలు గుండెపోటు ప్రమాదాన్ని పెంచగలవా? అనే చర్చకు దారితీసింది.
జిమ్ చేస్తుండగా గుండెపోటు వచ్చి ఇటీవల కొందరు సెలబ్రిటీలు కన్నుమూశారు. తాజాగా, హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ్‌కు ఢిల్లీలోని జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటు రావడంతో దవాఖానకు తరలించారు. వైద్యులు అతడిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తున్నది.. ఇటీవల ఇలాంటి కేసుల సంఖ్య పెరగడం తీవ్రమైన వ్యాయామాలు గుండెపోటు ప్రమాదాన్ని పెంచగలవా? అనే చర్చకు దారితీసింది.
వ్యాయామం లేదా భారీ శారీరక శ్రమ సమయంలో అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం అనేది ఇప్పటికే ఉన్న అడ్డంకులు, రోగ నిర్ధారణ లేదా రోగనిర్ధారణ చేయని కారణంగా ఎక్కువగా సంభవిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. గుండె రక్తనాళపు గోడల్లో చీలిక ఏర్పడితే అది గుండెపోటు లాంటి ప్రమాదానికి దారితీయవచ్చని చెబుతున్నారు. గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో చెప్పుకోదగ్గ బ్లాక్స్ లేకపోయినా.. కొవ్వుకణాలతో ఏర్పడిన ‘ప్లాక్’పైన పగుళ్లు ఏర్పడితే రక్తం గడ్డకట్టి, అది రక్తప్రవాహానికి అడ్డంకిగా మారిపోతుందని, ఇదికాస్తా గుండెపోటుకు కారణం కావచ్చని వివరిస్తున్నారు. మరికొందరిలో ఎలాంటి ప్లాక్స్ / బ్లాక్ లేకపోయినా అక్కడ అకస్మాత్తుగా రక్తపు గడ్డలు ఏర్పడటం వల్ల కూడా గుండెపోటు రావచ్చని అంటున్నారు. కొంతమందిలో క్లాట్స్ ఏర్పడే తత్వం సహజంగానే ఉంటుందని నిపుణులు తెలిపారు. వీటితోపాటు జన్యుపరమైన కారణాలతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. దీనికి ఫిట్నెస్తో సంబంధం లేదని అంటున్నారు.
ఇవి పాటిస్తే గుండె సేఫ్
- జిమ్‌లో అధిక శారీరక శ్రమ చేసేవారు పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
- ఆయిల్ లేదా జంక్ ఫుడ్ తినడం మానుకోండి.
- రక్త ప్రవాహాన్ని నియంత్రణలో ఉంచేందుకు శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయాలి.
- ఆరోగ్యం బాగా లేనప్పుడు జిమ్‌కు వెళ్లొద్దు.
- శారీరక సామర్థ్యాలకు అనుగుణంగా వ్యాయామం చేయాలి.
- రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

