Bad breath | చిన్నారుల్లో నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది..? కారణాలు ఇవీ..!
Bad breath | చిన్నారుల్లో మనం నోటి దుర్వాసన రావడం గమనిస్తుంటాం. అయితే, ఈ నోటి దుర్వాసనకు గల కారణాలు తెలుసుకుని అది రాకుండా చేయాలి. భవిష్యత్లో ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీయకుండా పెద్దలు చర్యలు తీసుకోవాలి.
Bad breath | ప్రస్తుతం చాలా మంది చిన్నారులను వేధిస్తున్న సమస్య నోటి దుర్వాసన. దంతాలపై తగినంత శ్రద్ధ పెట్టకపోవడం వలన నోటి దుర్వాసన సమస్య తీవ్రమవుతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దంతాలను ఏదో విధంగా వాడుతుంటాం. అయితే, ఎంతో ప్రాధాన్యం గల పళ్లను నిర్లక్ష్యం చేయటం, పళ్లను సరిగా శుభ్రం చేయక పోవడం వలన కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ తోడై నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్య కారణంగా చిన్నారులు ఆత్మనూన్యతకు లోనై ఎవరితో సరిగా మాట్లాడలేకపోతారు. లోలోన బాధపడుతూ ఉంటారు. అంటుకుపోయే ఆహారాల కారణంగా కూడా నోటిలో దుర్వాసన వస్తుంటుంది. సైనసైటిస్ లేదా టాన్సిలైటిస్ వంటి వ్యాధులతో బాధపడుతుండే వారిలో కూడా నోటి దుర్వాసన కనిపిస్తుంటుంది.
పూర్ ఓరల్ హైజీన్
పిల్లలు తమ దంతాలను పూర్తిగా శుభ్రం చేయనప్పుడు, బాగా ఫ్లాసింగ్ చేయనప్పుడు వారి నోటిలో ఆహారం ముక్కలు, ఫ్లేక్స్ పేరుకుపోతాయి. ఇవే నోటిలో దుర్వాసనను సృష్టిస్తాయి. మురికిగా ఉండే నాలుక కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది. నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా నాలుక వెనుక భాగంలోని చర్మ కణాలకు అంటుకుని ఉండి దుర్వాసనను కలుగజేస్తుంది. కావిటీస్తో బాధపడేవారిలో కూడా దుర్వాసన వస్తుంటుంది. అందుకని నోటి పరిశుభ్రతకు పిల్లలు ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలి.
డ్రై మౌత్
నోటిలో లాలాజలం కారణంగా నోరు తడిగా ఉంటుంది. అదే లాలాజలం తక్కువగా ఉండే పిల్లల నోరు పొడిగా ఉంటుంది. లాలాజలం ఆహార కణాలను శుభ్రం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. లాలాజలం లేనట్లయితే నోట్లోనే బ్యాక్టీరియా ఉండిపోతుంది. ఫలితంతా ఇది నోటి దుర్వాసనకు దారితీస్తుంది. పిల్లలు ఎక్కువగా నీరు తాగని సందర్భాల్లో డ్రౌ మౌత్ ఏర్పడుతుంది. అందుకని చిన్నారులు ఎక్కువగా నీరు తాగేలా చూసి వారి నోరు పొడిబారకుండా కాపాడాలి. కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు కూడా నోరు పొడిబారుతుంది.
మౌత్ బ్రీతింగ్
మనం ముక్కు ద్వారానే శ్వాస పీల్చుకోవాలి. అయితే, ఎవరైతే పిల్లలు నోటి ద్వారా శ్వాస పీల్చుకుంటారో వారి నోటిలో నుంచి దుర్వాసన వస్తుంటుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పోర్టల్లో ప్రచురించిన పరిశోధన పత్రం పేర్కొంటున్నది. నోరు ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు నోరు పొడిబారిపోయి దుర్వాసనకు కారణమవుతుందని తేల్చారు.
ముక్కులో ఫారిన్ బాడీస్
చిన్నారులు తమకు తెలియకుండానే వివిధ వస్తువులను ముక్కులో పెట్టుకుంటుంటారు. దీని వల్ల ముక్కు ఇన్ఫెక్షన్ వచ్చి వారిలో నోటి దుర్వాసన కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ముక్కులో ఉండే ఫారిన్ బాడీస్ బయటకు తీసేయాలి. ఇలాంటి అలవాటు ఉన్న వారి పట్ల పెద్దలు జాగ్రత్త వహించాలి.
ఇతర ఆరోగ్య సమస్యలు
సైనసైటిస్, టాన్సిలైటిస్ వంటి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా చిన్నారుల్లో నోటి దుర్వాసన వస్తుంది. బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, అలెర్జీల కారణంగా ముక్కు భాగంలో వాపు వచ్చి సైనసైటీస్కు కారణమవుతుంది. ఈ స్థితిలో గొంతులో ఒక రకమైన ద్రవం వచ్చి చేరి బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు దోహదపడి నోటి దుర్వాసనకు మూలంగా నిలుస్తుంది.
చిన్నారుల నోటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించగానే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి. సరైన విధంగా నోటి పరిశుభ్రత పాటించేలా వారికి అలవాట్లు నేర్పాలి. ఈ సమస్య భవిష్యత్లో ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయకుండా ఉండేందుకు వీలైనంత త్వరగా ఈ సమస్య నుంచి చిన్నారులను బయట పడేయాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

