Health Tips | పర్పుల్ కలర్ మీకు ఇష్టమైతే మీ ప్లేట్‌లోనూ అది ఉండేలా చూసుకునే సమయం వచ్చేసింది. సహజంగా పర్పుల్ రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ఇన్ఫ్లమేషన్తో పోరాడి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. పర్పుల్ వర్ణంలో ఉండే ఆహార పదార్దాల్లో మొక్కల ఆధారిత యాంటీఆక్సిడెంట్స్ పాలీపెనాల్స్ అధికంగా ఉంటాయని జర్నల్ ఆప్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజంలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.
పాలీపెనాల్స్ చర్మ క్యాన్సర్ ముప్పును తగ్గించడమే కాకుండా చర్మం కాంతులీనేలా చేస్తాయి. ఇక ద్రాక్ష, కిస్మిస్లు అధికంగా తీసుకోవడం ద్వారా చర్మాన్ని అల్ట్రావయలెట్ రేడియేషన్‌కు గురికాకుండా నిలువరిస్తాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇక బీట్రూట్ జ్యూస్ తరచూ తీసుకోవడం ద్వారా ఇన్ఫ్లమేషన్ తగ్గడంతో పాటు శరీరంలో రక్త సరఫరా మెరుగవుతుందని ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని వెబ్ఎండీ తెలిపింది.
ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కణాలను కాపాడటంలో బీట్రూట్ కీలకంగా పనిచేస్తుందని జర్నల్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన పరిశోధన వెల్లడించింది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్కు దారితీసి క్యాన్సర్ సహా చర్మ వ్యాధులకు దారితీస్తుంది. ఇంకా చర్మ సంరక్షణకు, నునుపైన చర్మం కోసం ప్యాషన్ ఫ్రూట్, పర్పుల్ క్యాబేజ్, వంకాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని పరిశోధకలు సూచిస్తున్నారు.
Read More :
Loksabha Elections 2024 | నా గెలుపుతో బహిష్కరణకు దీటైన సమాధానం ఇస్తా : మహువ మొయిత్ర