న్యూఢిల్లీ : ప్రతిరోజూ ఉదయాన్నే ప్రొటీన్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌తో కంటి ఆరోగ్యం మెరుగవడమే కాకుండా (Health Tips) రోజంతా ఉత్సాహంగా గడపవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రొటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్‌తో జీవక్రియల వేగం పెరగడమే కాకుండా ఎక్కువసేపు కడుపునిండిన భావనతో బరువు తగ్గే వెసులుబాటు ఉందని పేర్కొంది.
ప్రొటీన్ అధికంగా ఉండే బ్రేక్‌ఫాస్ట్‌తో కంటి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కండ్లు ఆరోగ్యంగా ఉండాలంటే లుటిన్, జియాక్సన్థిన్, విటమిన్ ఈ, జింక్ వంటి పోషకాఉ అవసరమని అమెరికన్ ఆప్టోమెట్రిక్ అసోసియేషన్ పేర్కొంది. ఈ ప్రొటీన్లు కండ్లలో ఆరోగ్యకర రెటీనా మెయింటెన్ చేయడంతో పాటు వయసుతో పాటు వచ్చే క్యాటరాక్ట్స్ వంటి రుగ్మతలను వాయిదా వేయవచ్చని జర్నల్ న్యూరాన్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది.
ఈ ప్రొటీన్లతో కూడిన ఆహారాన్ని ఎంపిక చేసుకుంటే ఆయా ఆరోగ్యప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఉదయాన్నే ప్రొటీన్ అధికంగా ఉండే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ఎంపిక చేసుకోవడం మేలు.
బాయిల్డ్ ఎగ్స్
ఎగ్ పరాటా
ఓట్స్ ఇడ్లీ
పెసరట్టు
పీనట్ మసాలా
Read More :