Health Tips | ఈ ఆహారంతో అలసట, నిస్సత్తువ మటుమాయం
Health Tips : ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో దాదాపు ప్రతి ఒక్కరినీ నిస్సత్తువ, అలసట ఆవహిస్తుంది. అయితే ఉదయాన్నే పోషక విలువలతో కూడిన అల్పాహారంతో రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు.
Health Tips : ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో దాదాపు ప్రతి ఒక్కరినీ నిస్సత్తువ, అలసట ఆవహిస్తుంది. అయితే ఉదయాన్నే పోషక విలువలతో కూడిన అల్పాహారంతో రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. ప్రొటీన్, ఆరోగ్యకర కొవ్వులతో రోజును ప్రారంభించడం మేలని వారు సూచిస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులతో రోజంతా హుషారుగా గడుపుతూ అలసటను పారదోలవచ్చని చెబుతున్నారు.
వైట్ బ్రెడ్, పేస్ట్రీస్ వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లను తీసుకోవడం నిలిపివేసి వాటి స్ధానంలో బ్రౌన్ రైస్, క్వినోవా వంటి కాంప్లెక్స్ కార్బ్స్‌తో పాటు బీన్స్, పప్పు ధాన్యాలు, స్వీట్ పొటాటోస్, కార్న్ వంటి పిండిపదార్ధాలతో కూడిన కూరగాయలు అధికంగా తీసుకోవాలని ప్రముఖ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సంగీతా తివారీ చెబుతున్నారు. ఇవి శక్తిని మెల్లిగా విడుదల చేస్తూ, ఎక్కువ సేపు అలసటకు గురికాకుండా చూస్తాయని చెప్పారు. ఇక శరీరంలో కణాలు, ఎంజైమ్స్‌ను బలోపేతం చేసేందుకు ప్రొటీన్‌ను అధికంగా తీసుకోవాలి. ఇది బ్లడ్ షుగర్‌ను నియంత్రించగంతో పాటు శక్తి హీనం కాకుండా నిలువరిస్తాయని ఆమె వివరించారు.
చికెన్, ఫిష్, తోఫు, నట్స్ వంటి లీన్ ప్రొటీన్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. చక్కెర అధికంగా ఉండే పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను పెంచి అలసటకు గురిచేస్తాయని వీటి స్ధానంలో పండ్ల నుంచి అందే సహజ చక్కెరలను మితంగా తీసుకోవచ్చని డాక్టర్ తివారీ పేర్కొన్నారు. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను పెంచే నూనె పదార్ధాలను కూడా తగ్గించాలని మణిపాల్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ ఇంద్రాణి ఘోష్ చెబుతున్నారు. అవకాడో, ఆలివ్ ఆయిల్, నట్స్, ఫ్యాటీ ఫిష్ వంటి ఆరోగ్యకర కొవ్వులను తీసుకోవచ్చని ఇవి శక్తిని ఉత్పత్తి చేయడంతో పాటు హార్మోన్ల నియంత్రణకు ఉపకరిస్తాయని చెప్పారు. వీటితో పాటు తాజా పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి.
Read More :
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

