Janhvi Kapoor: కంచి పట్టు చీరపై 1983 వరల్డ్‌కప్ విన్నింగ్ డిజైన్.. స్టన్నింగ్ లుక్‌లో జాన్వీ కపూర్
Janhvi Kapoor: జాన్వీ కపూర్ కంచిపట్టు చీర కట్టింది. ఆ చీరపై 1983 వరల్డ్‌కప్ విన్నింగ్ మూమెంట్‌ను డిజైన్ చేశారు. వారణాసిలో ఓ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న జాన్వీ ఆ ఫ్యాషన్ లుక్‌లో అట్రాక్ట్ చేసింది. గంగాహారతిలో పాల్గొన్నది.
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) స్టన్నింగ్ లుక్‌లో దర్శనమిచ్చారు. కంచి పట్టు చీర కట్టిన ఆ ముద్దుగుమ్మ.. తన అందాలతో ఆకర్షిస్తోంది. బ్లూ కలర్ శారీ కట్టుకున్న జాన్వీ.. ఆ పట్టు చీరపై క్రికెట్ డిజైన్ వేసుకున్నది. మిస్టర్ అండ్ మిస్సెస్ మహీ ఫిల్మ్ కోసం వారణాసిలో ప్రమోషన్ చేస్తున్న ధడక్ గర్ల్.. చాలా వెరైటీ శారీలో తళుక్కుమన్నది. గంగా నది తీరంలో పడవపై వెళ్తూ ఆమె తన చీరలో దాగిన డిజైన్ వర్క్‌ను ప్రజెంట్ చేసింది. బ్లూ కలర్ చీరపై చేయితో నేసిన డిజైన్ వర్క్ ఆకట్టుకంటోంది. 1983 వరల్డ్ కప్ గెలిచిన సందర్భానికి చెందిన క్షణాలను ఆ చీరపై అత్యంత కళాత్మకంగా డిజైన్ చేశారు. మిరుమిట్లు గోలిపే స్టేడియంలో ఓ బ్యాటర్ భారీ సిక్స్ కొట్టినట్లు ఆ చీర డిజైన్‌లో చూపించారు. క్రికెటర్లు పవర్ఫుల్ షాట్లు ఆడుతున్నట్లు కూడా డిజైన్‌లో క్రియేట్ చేశారు. షార్ట్ స్లీవ్ బ్లౌజ్ వేసుకున్న జాన్వీ.. బ్యాక్‌లెస్ టై నాట్‌తో సంప్రదాయబద్దంగా కనిపించింది. క్రికెట్ స్టోరీ నేపథ్యం ఉన్న చిత్రంలో నటిస్తున జాన్వీ.. ఆ కాన్సెప్ట్‌తో డిజైన్ చేసిన చీరలో తన ఫ్యాషన్ ట్యాలెంట్‌ను ప్రదర్శించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

