పాప్‌కార్న్ లంగ్ అంటే విపరీతమైన దగ్గు ఉక్కిరిబిక్కిరి చేయడం. శ్వాస సరిగ్గా ఆడని పరిస్థితి. వైద్యపరంగా దీన్ని ‘బ్రాంకియో లైటిస్ ఆబ్లిటరన్స్’గా పేర్కొంటారు. ఇది ఊపిరితిత్తుల్లోని సూక్ష్మమైన వాయునాళాలను దెబ్బతీస్తుంది. దీంతో శ్వాసక్రియ వేగం తగ్గుతుంది. పొడిదగ్గు బాధిస్తుంది. మైక్రోవేవ్‌లో పాప్‌కార్న్ తయారు చేస్తున్నప్పుడు రుచికోసం వాడే రసాయనాన్ని పీల్చినా కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తుతుంది. అందుకే ఈ పేరు వచ్చింది.
Popcorn Lung | రక్తం.. శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను ఊపిరి తిత్తుల నుంచి గ్రహిస్తుంది. మనం శ్వాస తీసుకున్నప్పుడు.. ఆ గాలి శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అక్కడికి ప్రవేశించడానికి ముందు శ్వాసనాళం బ్రాంకై పేరుతో కుడిఎడమలుగా చీలిపోతుంది. ఈ నాళాలు మళ్లీ చిన్నచిన్న బ్రాంకియోలీస్గా విడిపోతాయి. బ్రాంకియోలీస్ దగ్గర ఆల్వియోలై ముగిసిపోతాయి. రక్తం ఆక్సిజన్‌ను గ్రహించేది ఇక్కడే. పాప్‌కార్న్ లంగ్ ఉన్నప్పుడు.. ఈ సూక్ష్మమైన మార్గాలు వాపునకు గురవుతాయి. ఈ పరిస్థితి ఆక్సిజన్‌ను రక్తంలోకి వెళ్లనీయదు. దీంతో శ్వాస సరిగ్గా ఆడదు.
ఎలా వస్తుంది?
పాప్‌కార్న్ లంగ్ సమస్య ‘డయాసిటైల్’ వల్ల ఉత్పన్నం అవుతుంది. మైక్రోవేవ్ ఓవెన్లో.. పాప్‌కార్న్ తయారీ ప్రక్రియలో భాగంగా రుచికోసం ఈ రసాయనాన్ని వాడతారు. పాప్‌కార్న్ కంపెనీల ప్యాకేజింగ్ విభాగంలో పనిచేసేవారిలో ఈ సమస్యను గుర్తించారు. అలా దీనికి పాప్‌కార్న్ లంగ్ అనే పేరు వచ్చింది. ఎసిటాల్డిహైడ్ అనే కెమికల్ కూడా పాప్‌కార్న్ లంగ్‌కు కారణమే. ఎలక్ట్రానిక్ సిగరెట్లు, మత్తు పదార్థం మార్జువానాలో ఈ రసాయనం ఉంటుంది.
ఎసిటాల్డిహైడ్.. నోటి పైపొర (మౌత్ లైనింగ్), గొంతు, పొట్టకు హానికరం. సల్ఫర్ డై ఆక్సైడ్తో పాటు జిగుర్లు, భవన నిర్మాణ సామగ్రి తయారీలో ఉపయోగించే ఫార్మాల్డిహైడ్, వెల్డింగ్‌లో విడుదలయ్యే మెటల్ ఆక్సైడ్ పొగలు, క్లోరిన్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, అమ్మోనియా, నైట్రోజన్ ఆక్సైడ్స్ వల్ల కూడా ఈ ఇబ్బంది తలెత్తుతుంది. వీటికితోడుగా న్యుమోనియా, బ్రాంకైటిస్ వ్యాధులు సైతం పాప్‌కార్న్ లంగ్‌కు దారితీస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగుల్లోనూ ఈ పరిస్థితి తలెత్తవచ్చు. ఊపిరితిత్తుల మార్పిడి అవసరమైనవారిలో.. బ్రాంకీయోలైటిస్ ఆబ్లిటరెన్స్ ఉన్న ప్పుడు.. శరీరం కొత్త అవయవాలను తిరస్కరిస్తుంది. కాదని మార్పిడి చేస్తే కొన్నేండ్లలో రోగి మరణించే ఆస్కారం ఉంది.
లక్షణాలు
కొన్ని రసాయనాల ప్రభావానికి గురైనప్పుడు.. రెండు వారాల నుంచి రెండు నెలల్లోపు ఎప్పుడైనా వ్యాధి లక్షణాలు బయటపడొచ్చు. బరువైన పనులు చేస్తున్నప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అదే ఊపిరితిత్తుల మార్పిడి వల్ల
ఉత్పన్నమైతే లక్షణాలు బయటపడటానికి కొన్నేండ్ల సమయం పడుతుంది. తరచూ అలసిపోయినట్టు అనిపిస్తున్నా, జలుబు, ఆస్తమా లాంటి రుగ్మతలు లేనప్పుడు కూడా.. ‘గుర్‌గుర్’మని శ్వాసిస్తున్నా దీన్ని పాప్‌కార్న్ లంగ్ లక్షణంగా భావించాల్సి ఉంటుంది.
నిర్ధారణ
వ్యాధి నిర్ధారణ కోసం వైద్యులు ఛాతీ సీటీ స్కాన్ సిఫారసు చేస్తారు. వివిధ కోణాల్లో ఎక్స్‌రే తీయించి..
వాటిని అధ్యయనం చేసిన తర్వాతే కచ్చితమైన నిర్ధారణకు వస్తారు. అంతేకాదు, ఊపిరితిత్తుల పనితీరును కూడా
పరిశీలించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తుల్లో గాలి బాగా పేరుకుపోయి ఉంటే ఛాతీ ఎక్స్‌రేలో ఆ విషయం తేలుతుంది. పాప్‌కార్న్ లంగ్ నిర్ధారణకు బయాప్సీ కూడా మేలైన పరీక్షే. ఇందులో ఊపిరితిత్తుల నుంచి ఓ చిన్నభాగాన్ని తీసుకుని
మైక్రోస్కోప్‌లో క్షుణ్నంగా పరీక్షిస్తారు.
చికిత్స