Weight Loss Tips | బరువు తగ్గాలంటే ఈ సూచనలను పాటించడం తప్పనిసరి.. లేదంటే సమస్య పరిష్కారం కాదు..
మారిన జీవన విధానం కారణంగా తలెత్తే సమస్యల్లో మొదటిది అధిక బరువు. ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతున్నారు. అధిక బరువు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆరోగ్యం మీద సృహ రావడంతో చాలా మంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు.
Weight Loss Tips | మారిన జీవన విధానం కారణంగా తలెత్తే సమస్యల్లో మొదటిది అధిక బరువు. ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతున్నారు. అధిక బరువు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆరోగ్యం మీద సృహ రావడంతో చాలా మంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. బరువు తగ్గాలని అనుకోగానే ముందుగా చాలా మంది ఆహారాన్ని కట్టడి చేయడం ప్రారంభిస్తారు. కార్బొహైడ్రేట్లు మానేయడం, ఇష్టమైన వంటకాలను దూరం పెట్టడం, కఠినమైన డైట్లు పాటించడం వంటివి అందరిలో సాధారణంగా కనిపిస్తాయి. అయితే ఈ నమ్మకాలలో చాలా వరకు నిజం కాదని ఫిట్నెస్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. బరువు తగ్గాలంటే ఫాస్ట్ ఫుడ్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. సరైన క్యాలరీలను తీసుకుంటూ, తగినంత ప్రోటీన్ అందుకుంటే అప్పుడప్పుడు బర్గర్లు లేదా ర్యాప్స్ తిన్నా బరువు తగ్గడంలో పెద్ద సమస్య ఉండదని వారు చెబుతున్నారు.
అసలు సమస్య అదే..
మీల్ ప్రెప్ అనే అలవాటు అందరికీ అవసరం కాదు. ముందుగానే వండిన ఆహారం చాలా సందర్భాల్లో వృథా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సులభంగా, త్వరగా తయారు చేసుకునే ఆహారాలను ఎంపిక చేసుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఉదయం అల్పాహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరమని, ప్రోటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే రోజంతా ఆకలి నియంత్రణలో ఉంటుందని, తక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకుంటే త్వరగా ఆకలి వేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే కార్బొహైడ్రేట్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. బియ్యం, రొట్టె, ఆలుగడ్డలు వంటి ఆహారాలు సమస్య కాదు. అసలు సమస్య ఎక్కువగా తినడమేనని వారు చెబుతున్నారు. ఇంట్లో వండిన ఆహారం మాత్రమే ఆరోగ్యకరం అనే భావన పూర్తిగా నిజం కాదని, బయట తిన్నా, ఇంట్లో తిన్నా ప్రోటీన్, క్యాలరీలు ఒకే విధంగా పనిచేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
అన్ని రకాల వ్యాయామాలు అవసరం..
ఇక వ్యాయామంలో కార్డియోకే ప్రాధాన్యం ఇవ్వడం సరైన విధానం కాదు. శక్తి వ్యాయామాలు (strength training) కూడా చాలా ముఖ్యమైనవి. మొదట వెయిట్ లిఫ్టింగ్ చేసి, తరువాత వాకింగ్ చేయడం మంచిది. సప్లిమెంట్స్ ఎక్కువగా అవసరం ఉండవు. సాధారణ ఆహారంతోనే ఎక్కువ పోషకాలు పొందవచ్చు. జిమ్లో ఎక్కువ సమయం గడిపితేనే ఫలితాలు వస్తాయని అనుకోవడం తప్పు. క్రమంగా, నిరంతరంగా చేయడం (consistency) ముఖ్యమైనదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బరువు కొలిచే త్రాసుపై చాలా మంది ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. రోజువారీ బరువు మార్పులు సహజం. అయితే దానిని కొవ్వు పెరిగిందని అర్థం చేసుకోకూడదని వారు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు సంకల్పబలం (willpower) మీద మాత్రమే ఆధారపడకుండా, సులభమైన ఆహార ప్రణాళికలు అలవాటు చేసుకోవాలని, ఆహారాన్ని కఠినంగా నియంత్రించడం కంటే, దానిని సరిగ్గా అర్థం చేసుకుని సమతుల్యంగా తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం సులభం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Cholesterol
- fat
- health tips
- Obesity
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

