Menstruation | నెలసరి రావాలంటే మందులు వాడాల్సి వస్తుంది.. ఈ సమస్యకు కారణం బరువు పెరగడమేనా?
Menstruation | నా వయసు 21 సంవత్సరాలు. ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. బరువు 65 కేజీలు. మూడేళ్ల నుంచి పీసీఓడీ సమస్య ఉంది. లాక్డౌన్లో బరువు పెరిగాను. ఆ తర్వాతే ఈ ఇబ్బంది వచ్చింది.
Menstruation | నా వయసు 21 సంవత్సరాలు. ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. బరువు 65 కేజీలు. మూడేళ్ల నుంచి పీసీఓడీ సమస్య ఉంది. లాక్డౌన్లో బరువు పెరిగాను. ఆ తర్వాతే ఈ ఇబ్బంది వచ్చింది. ప్రస్తుతం నెలసరి రావాలంటే డాక్టర్ ఇచ్చిన మందులు వాడాల్సి వస్తున్నది. నేను బరువు పెరగడం వల్లే ఈ సమస్య వచ్చిందా. బరువు తగ్గితే తగ్గిపోతుందా?
– ఓ పాఠకురాలు
అవును, కచ్చితంగా బరువు పెరగడం వల్లే మీకు ఈ సమస్య వచ్చింది. అలాగే వేళకు తిండి, నిద్రలేని జీవనశైలి కూడా ఇందుకు కారణం కావచ్చు. బరువు పెరిగితే విసరల్ ఫ్యాట్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే ఆడపిల్లల్లో పొట్టచుట్టూ చేరే కొవ్వు ఇది. దీనివల్ల శరీరంలోని ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. దాంతో అండం సమయానికి విడుదల కాదు. వీటన్నిటి వల్లా నెలసరి సక్రమంగా రాదు. దాన్ని సరిచేసేందుకు హార్మోన్ మాత్రలు వాడాల్సి వస్తున్నది.
కాబట్టి ముందు మీరు బరువు తగ్గండి. సరైన ఆహారాన్ని తీసుకుని, వ్యాయామాన్ని రోజువారీ కార్యక్రమాల్లో భాగం చేసుకోండి. పచ్చళ్లు, స్వీట్లు, చక్కెర, వేపుళ్ల లాంటివి దూరం పెట్టండి. అలా అని పూర్తిగా తిండి మానేయకూడదు. ఉదయాన్నే నడక ప్రారంభించాలి. ఇవన్నీ చేస్తూ బరువు తగ్గాలి. అప్పుడు పీసీఓడీ తగ్గి, గర్భం ధరించడమూ సులభం అవుతుంది.
లేకపోతే ప్రెగ్నెన్సీ సమయంలో బీపీ, షుగర్లాంటివి రావడమే కాదు, అబార్షన్లు ఎక్కువగా జరిగే ప్రమాదమూ ఉంది. కాబట్టి డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూనే బరువు తగ్గే ప్రయత్నం చేయండి. వరుసగా మూడు నెలలు నెలసరి రాకపోతే గర్భాశయంలో ఉండే పొర మందం అయిపోయి, మరికొన్ని కొత్త సమస్యలకు దారితీస్తుంది. జాగ్రత్త.
డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

