చాపకింద నీరులా.. ఒవేరియన్ క్యాన్సర్
ఒవేరియన్ క్యాన్సర్.. ఇది మహిళల్లో వచ్చే రెండో సర్వసాధారణమైన క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ తరువాత అత్యధికంగా వచ్చే క్యాన్సర్లలో ఒకటి. ఇది ఒక సైలెంట్ కిల్లర్. దీని లక్షణాలు అంత త్వరగా బయటపడవు. అండాశయాలలో కణాలు అపరిమితంగా పెరిగి, పక్కనున్న టిష్యూలకు,
ఒవేరియన్ క్యాన్సర్.. ఇది మహిళల్లో వచ్చే రెండో సర్వసాధారణమైన క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ తరువాత అత్యధికంగా వచ్చే క్యాన్సర్లలో ఒకటి. ఇది ఒక సైలెంట్ కిల్లర్. దీని లక్షణాలు అంత త్వరగా బయటపడవు. అండాశయాలలో కణాలు అపరిమితంగా పెరిగి, పక్కనున్న టిష్యూలకు, ఇతర భాగాలకు వ్యాపించడాన్నే
‘ఒవేరియన్ క్యాన్సర్’ అంటారు. గర్భాశయానికి రెండు పక్కలా బాదంపప్పు పరిమాణంలో ఉండే అండాశయాలు, అండాలను ఉత్పత్తి చేయడంతోపాటు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్లే స్త్రీలలో నెలసరికి దోహదపడతాయి. ఈ హార్మోన్లు సక్రమంగా విడుదలైనంత కాలం సంతాన లేమి, ఇతర గైనిక్ సమస్యలు దరిచేరవు.
‘ఒవేరియన్ క్యాన్సర్’ మూడు రకాలు:
అండాలు, స్త్రీ హార్మోన్లు(ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్)లను ఉత్పత్తి చేసే అండాశయాలలో అపరిమితంగా పెరిగే కణాల ఆధారంగా ఒవేరియన్ క్యాన్సర్ మూడు రకాలు.
1. ఎపిథిలియల్ ఒవేరియన్ క్యాన్సర్. 2. జెర్మ్‌సెల్
ఒవేరియన్ క్యాన్సర్. 3. స్టోమల్ ఒవేరియన్ క్యాన్సర్.
స్త్రీలలో 50ఏళ్లు పైబడిన తరువాత ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్‌ను సైలెంట్ కిల్లర్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే అండాశయాలు పొత్తికడుపులో చాలా లోపలికి ఉంటాయి. వీటికి వచ్చే క్యాన్సర్ లక్షణాలు కూడా ఆలస్యంగా బయటపడతాయి. అంతేకాకుండా అజీర్తి, యూరినరీ ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలుగా భావించే అవకాశం ఉంటుంది. మొదట్లో ఈ లక్షణాలు అంత తీవ్రంగా లేకపోవడం వల్ల తొలి దశలో ఈ క్యాన్సర్‌ను గుర్తించడం అంత సులువు కాదు. అయితే, కింద పేర్కొన్న వాటిలో కొన్ని లక్షణాలు బయటపడవచ్చు.
- పొత్తికడుపు ఉబ్బినట్లు, నొప్పిగా ఉండటం
- అజీర్తి, వికారం, తేన్పులు లాంటి సమస్యలు
- యోని స్రావాలు అసాధారణంగా ఉండటం
- మూత్రం తరచూ రావడం, అలసట, జ్వరం
- కొంచెం తినగానే పొట్ట నిండినట్లు ఉండటం
- ఊపిరి కష్టంగా ఉండటం
- వెన్నునొప్పి లేదా నడుము నొప్పిగా అనిపించడం
- అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం
వీరిలో ఎక్కువ
- పిల్లలు కలగని స్త్రీలలో
- బ్రెస్ట్, కొలన్ క్యాన్సర్ వచ్చినవారిలో
- సంతానం కోసం అధిక మోతాదులో మందులు వాడిన వారిలో
- హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ దీర్ఘకాలికంగా తీసుకున్న వారిలో
- కొవ్వు పదార్థాలు, మాంసాహారం అధికంగా తీసుకునే వారిలో
అనుమానం ఉంటే ఈ పరీక్షలు చేయించుకోవాలి :
సాధారణంగా గైనకాలజిస్టుల వద్దకు వెళ్లినప్పుడు గైనిక్ చెకప్‌లో ఈ క్యాన్సర్ అంత సులువుగా బయట పడక
పోవచ్చు. అందుకే అనుమానం ఉంటే అల్ట్రాసౌండ్తోపాటు రక్త పరీక్షలు, సీఏ 125, పాప్ టెస్ట్ తదితర పరీక్షలతోపాటు సీటీ-స్కాన్, ఎంఆర్ఐ వంటివి కూడా చేయాల్సి ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్‌కు కారణమయ్యే బ్రాకా జీన్ మ్యుటేషన్లో తేడాలున్నప్పుడు ఈ క్యాన్సర్ పరీక్షలు 25ఏళ్ల వయసు నుంచి చేయించడం ఉత్తమం. మెనోపాజ్ దశకు ముందు నుంచే ఈస్ట్రోజన్ హార్మోన్‌ను మాత్రమే 5నుంచి 10ఏళ్ల కంటే ఎక్కువగా తీసుకుంటే ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరగవచ్చు. ప్రొజెస్టిరాన్ హార్మోన్ కాంబినేషన్లో ఈస్ట్రోజన్ తీసుకుంటే ఆ ముప్పు కొంతవరకు తగ్గవచ్చు. అన్ని క్యాన్సర్లలోలాగే ఈ క్యాన్సర్‌లో కూడా నాలుగు దశలు ఉంటాయి.
1వ దశ : వ్యాధి ఒకటి లేదా రెండు అండాశయాలకు మాత్రమే పరిమితం అవుతుంది
2వ దశ : గర్భాశయానికి వ్యాప్తి చెందడం
3వ దశ : అండాశయాలు, గర్భాశయంతోపాటు లింఫ్ నాళాలు, పొత్తికడుపు లైనింగ్‌కు వ్యాప్తిచెందడం.
4వ దశ : పై వాటితోపాటు ఇతర అవయవాలకు సోకడం
చికిత్సా విధానం
వ్యాధి దశల ఆధారంగా సర్జరీ, ఇతర థెరపీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతకాలం ఇవ్వాలో కూడా వ్యాధి ఉన్న దశపైనే ఆధారపడి ఉంటుంది. నోటి ద్వారా, ఐవీ ద్వారా లేదా నేరుగా పొట్టలోకి ఇచ్చే కీమోతోపాటు టార్గెటెడ్ థెరపీలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్యాన్సర్‌కు ఇచ్చే కీమో, రేడియోథెరపీలతో పెళ్లికాని అమ్మాయిలు మెనోపాజ్ వంటి సమస్యలకు గురవొచ్చు. అందుకే వీరి అండాలను చికిత్సకు ముందే తీసి, భవిష్యత్తులో సంతానం పొందడానికి భద్రపరుచు కోవచ్చు. ఈ రోజుల్లో వాడే గర్భ నిరోధక మాత్రలు వల్ల ట్యూబల్ లిగేషన్, హిస్టరెక్టమీ అయిన స్త్రీలలో ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ అని చెప్పవచ్చు.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98490 22121
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

