ఊబకార్యాలయం
అవును. ఊబకాయానికి, మనం పనిచేసే కార్యాలయానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆఫీసులో మన అలవాట్లు, మొహమాటాలు కూడా మన లావుకు ఓ కారణం కావచ్చు. కొందరికి క్యాంటీన్ చిరుతిళ్లు తీవ్ర వ్యసనం.
అవును. ఊబకాయానికి, మనం పనిచేసే కార్యాలయానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆఫీసులో మన అలవాట్లు, మొహమాటాలు కూడా మన లావుకు ఓ కారణం కావచ్చు. కొందరికి క్యాంటీన్ చిరుతిళ్లు తీవ్ర వ్యసనం. గంటకోసారి అటువైపు వెళ్తుంటారు. వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒకటి లాగిస్తుంటారు. ఓ కప్పు చాయ్ కోసం వెళ్లినవారు ఏ స్నేహితుల మొహమాటంతోనో సమోసాలు లాగిస్తారు. ఒత్తిడిలో మనం ఎక్కువ తినేస్తామని మానసిక నిపుణులు ఇప్పటికే నిర్ధారించారు. ఆఫీసు అంటేనే ఒత్తిడి. లక్ష్యాల వెంట పరుగు. దీంతో స్విగ్గీ నుంచో జొమాటో నుంచో ఏదో ఒకటి ఆర్డర్ చేస్తుంటారు. అలా ఇంకొన్ని కెలోరీలు తోడవుతాయి. చాలాసార్లు మనం పద్ధతిగా ఉన్నా, చుట్టుపక్కలవారి ఆహారపు అలవాట్లు మనల్ని పక్కదారి పట్టిస్తాయి.
భోజన ప్రియుడైన కొలీగ్ దెబ్బకు మన పొట్టా పెరిగి పోతుంది. చాలాసార్లు ఊపిరి సలుపుకోనివ్వనంత పని ఉంటుంది. దీంతో గంటలకొద్దీ కుర్చీకే పరిమితం అవుతాం. కదలికలు తగ్గినకొద్దీ కొవ్వు పేరుకుపోవడం ఖాయం. పెండింగ్ పనులు, ప్రాజెక్ట్ డెడ్లైన్లు ఓ పట్టాన నిద్రపోనివ్వవు. ఇంటికెళ్లినా.. ల్యాప్‌టాప్‌కు అతుక్కుపోతాం. నిద్రలేమికి, ఊబకాయానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. కాబట్టి, ముందుగా మీ జీవనశైలి లోపాలపై దృష్టి సారించండి. వీకెండ్ పార్టీలకు దూరంగా ఉండండి. ైక్లెంట్స్ విందులోనూ మితంగా ఆరగించండి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

