Childhood obesity | ఆన్లైన్ క్లాసులతో లావెక్కుతున్న చిన్నారులు
పిల్లల ఆకారం వయస్సుకు తగినట్లుగా ఉంటేనే అందం. తల్లిదండ్రులకూ అది ఆనందం. కొంచం బొద్దుగా ఉంటే ముద్దుగా కనిపిస్తారు. కానీ ఆ బొద్దుతనం హద్దుమీరితే వారి ఆరోగ్యం అనారోగ్యంతో ఆయాసపడాల్సి వస్తుంది. సాధారణంగా మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ మధ్య పిల్లల్లో ఊబకాయ సమస్య సర్వసాధారణమైంది. పిల్లల్లో ఊబకాయం రావడానికి ఆహారపు అలవాట్లు 80శాతం కారణమైతే 20శాతం వారి జీవనశైలి కారణం అంటున్నారు వైద్యనిపుణులు. తల్లిదండ్రుల్లో ఎవరైన ఒకరు ఊబకాయులైతే పిల్లల్లో ఊబకాయం వచ్చే అవకాశం 45శాతం ఉంటుంది. అదే తల్లిదండ్రులిద్దరూ ఊబకాయులైతే పిల్లల్లో ఊబకాయం రావడానికి 73శాతం అవకాశాలున్నాయి.

కరోనాకు పూర్వం 10నుంచి 13శాతం పిల్లల్లో ఊబకాయ సమస్య ఉండేది. కరోనా తరువాత ఈ సమస్య మరింత పెరిగింది. కొవిడ్ పరిస్థితుల కారణంగా గడిచిన యేడాదిన్నర కాలంలో ఊబకాయ సమస్య 13నుంచి 16శాతానికి చేరింది. అంటే దాదాపు సుమారు మూడు శాతం పెరిగినట్లు ఆరోగ్య సర్వేల ద్వారా తెలుస్తున్నది.

చెమటపడితేనే.. ఆరోగ్యంగా!
ఒబేసిటీతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులలో చాలా మంది తమ పిల్లలతో ప్రతిరోజూ వ్యాయామం చేయిస్తున్నాం, ఆటలు ఆడిస్తున్నామని అయినా పిల్లలు బరువు తగ్గడం లేదంటూ డాక్టర్స్ వద్ద కైంప్లెంట్స్ చేస్తుంటారు. మొక్కుబడిగా చేయిస్తే ఫలితం ఉండదు. ఆహార నియమాలు పాటిస్తూ ఫిజికల్ యాక్టివిటీస్ చేయించాలి. అది కూడా చెమటలు వచ్చే వరకు చేయిస్తేనే శరీరంలోని హై క్యాలరీస్ కరిగి కొవ్వు అనేది కరిగిపోతుంది.

శ్రమ తగ్గింది.. విశ్రాంతి పెరిగింది
పిల్లల్లో ఊబకాయ సమస్య అనేది ఈ మధ్యకాలంలో పెరుగుతున్నది. కరోనాకు పూర్వం కంటే కరోనా తరువాత ఈ సమస్య మరింత పెరిగింది. దీనికి ప్రధాన కారణం స్కూల్స్ షట్‌డౌన్ కావడం. పాఠశాలలు మూసి ఉంచడం వల్ల పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీస్ పూర్తిగా తగ్గిపోయింది. ఆన్లైన్ క్లాస్‌లతో గంటల తరబడి ఒకే చోట కూర్చోవాల్సి వచ్చింది. తల్లిదండ్రులు సైతం వర్క్‌ఫ్రమ్ హోమ్‌తో ఇండ్లకే పరిమితమయ్యారు. కరోనా భయంతో పిల్లలను భయటకు తీసుకెళ్లి ఆడిపించే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా ఒబేసిటికీ దారితీస్తున్నాయి. తల్లిదండ్రులు సైతం పిల్లలకు సమయపాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం ఇవ్వడం, ఎక్కువసార్లు స్నాక్స్ వంటివి ఇవ్వడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఒబేసిటీని సకాలంలో నియంత్రించకపోతే కౌమార దశకు చేరుకునే సరికి బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. బాలికల్లో అయితే సెలసరి, ఫెర్టిలిటీ తదితర సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

ప్రధాన కారణాలు
- ఆహారపు అలవాట్లు
- హై కాలరీస్గల ఫుడ్ తీసుకోవడం.
- శారీరక శ్రమ లేకపోవడం.
- ఎక్కువగా జంక్ ఫుడ్.
- తీసుకోవడం(పిజ్జా, బర్గర్లు, ఫాస్ట్‌ఫుడ్).
- భౌతిక ఆటలు కాకుండా డిజిటల్ ఆటలకు అంకితమవ్వడం.
- ఎర్లీ హైపర్‌టెన్షన్ అంటే బీపీ వస్తుంది.
- ఆయాసం లేదా ఉబ్బసం వస్తుంది.
- కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది.

ఆహార నియమాలు పాటించాలి
ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలి. ఫాస్ట్ఫుడ్లు, బర్గర్లు, వేపుడ్లు, బేకరీ ఫుడ్స్, మాంసహారం తదితర ఆహారానికి దూరంగా ఉండాలి. ఒకవేళ పిల్లలపై కఠిన ఆంక్షలు పెట్టకుండా అకేషనల్‌గా ఇవ్వొచ్చు. అయితే జంక్ ఫుడ్ తిన్న తరువాత దానికి తగిన ఫిజికల్ యాక్టివిటీ చేయించాలి. ఎక్కువశాతం సంప్రదాయక ఆహార పదార్థాలనే పిల్లలకు అలవాటు చేయడం ఉత్తమం. ఎక్కువగా పండ్లు, పండ్ల రసాలు, ఆకు కూరలు, శాఖాహారం ఇవ్వడం మంచిది.

తల్లిదండ్రులు రోల్ మోడల్‌గా మారాలి
సాధారణంగా పిల్లలు ఏదైనా చూసి నేర్చుకుంటారు. అంటే పెద్దవారు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. అందుకని తల్లిదండ్రులే పిల్లలకు రోల్ మోడల్‌గా మారాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, వాకింగ్, పిల్లలతో కలిసి ఆటలు ఆడడం చేయాలి. ఆహారం విషయంలోనూ తల్లిదండ్రులు నియమాలు పాటించాలి. పిల్లల ముందు గంటల తరబడి ఫోన్లలో చాటింగ్ చేయడం, యూట్యూబ్ చూడడం, డిజిటల్ గేమ్స్ ఆడటం
చేయకూడదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పల్లెల్లో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ అవుతున్న డయాబెటిస్ రోగులు.. ఎందుకంటే..
Child Health | మీ పిల్లలు నులిపురుగులతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా నివారించండి
Vaccines for children | మీ పిల్లలకు ఈ టీకాలు ఇప్పించారా?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

