Vaccines for children | మీ పిల్లలకు ఈ టీకాలు ఇప్పించారా?

Vaccines for children | తల్లిపాల ద్వారా శిశువుకు కొంత రోగ నిరోధక శక్తి సమకూరుతుంది. ముఖ్యంగా, కొద్ది రోజులపాటు వచ్చే పచ్చని ‘కొలస్ట్రమ్’ అనే పాలతో ఎంతో సత్తువ వస్తుంది. ఈ రోగ నిరోధక యాంటీబాడీలు వయసు పెరిగేకొద్దీ క్రమంగా తగ్గుతూ, మొదటి సంవత్సరానికి కనీస స్థాయికి చేరుకొంటాయి. ఫలితంగా, శిశువులో రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. టీకాలతో నివారించగలిగే అంటువ్యాధులు మొదటి సంవత్సరంలో తీవ్రంగా, తరచుగా వస్తుంటాయి. సరైన సమయానికి టీకాలు ప్రారంభించడంతో పాటు, పూర్తి డోసులు క్రమం తప్పకుండా ఇప్పించాలి. రెండు, మూడు డోసుల టీకాలు ఒకేరోజు కానీ, కనీసం 28 రోజుల వ్యవధితో కానీ ఇవ్వాలి. మధ్యలో ఆపేస్తే ఫలితం శూన్యం. కొన్ని టీకాలు ఒకేసారి ఇప్పిస్తే సరిపోతుంది. మరికొన్ని 3-4 సార్లు ఇవ్వాలి. హిబ్, టీపీటీ లాంటి టీకాలు మూడుసార్లు ఇప్పించినా కూడా, తిరిగి సంవత్సరం తరువాత బూస్టర్ డోసు తప్పనిసరి. టెటనస్ నుంచి జీవితకాల రక్షణకోసం ప్రతి పది సంవత్సరాలకొకసారి టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి.
క్రమం తప్పకుండా..
సాధ్యమైనంత వరకు సరైన సమయానికి, నిపుణుల సలహా ప్రకారం టీకాలు ఇప్పించాలి. ఒకవేళ ఆలస్యమైనా, ఎక్కడైతే వదిలేశారో అక్కడి నుంచే తిరిగి ప్రారంభించాలి. పూర్తి డోసులు ఇప్పించేవరకూ టీకాల నుంచి పరిపూర్ణ రక్షణ సమకూరదు. గతంలో ఇప్పించిన టీకాల తాలూకు రికార్డులు కనిపించకుండా పోయినా, పాత వివరాలు గుర్తుకురాక పోయినా వాటిని మళ్లీ ఇప్పించడమే సరైన పద్ధతి. పొరపాటున ఏదైనా డోసు రెండోసారి ఇచ్చినా ఎలాంటి నష్టం వాటిల్లదు. నష్టమంతా అసలు ఇవ్వకపోవడం వల్లనే! ఏ కారణం వల్లనైనా మొదటి సంవత్సరంలో టీకాలు ప్రారంభించనట్లయితే, వెంటనే ప్రారంభించి క్రమం తప్పకుండా ఇప్పించాలి. ఏ టీకా ఎప్పుడు ఇప్పించాలనేది ఆయా దేశాలలో వ్యాధి తీవ్రతను బట్టి, వ్యాపించిన విధానాన్ని బట్టి, ఏ వయసులో, ఏఏ మాసాలలో, ఎంతమందికి వస్తున్నదనే వివరాలపై.. ఆధారపడి ఉంటుంది. కాలక్రమేణా ఆయా వ్యాధులలో పరివర్తనలు వచ్చినప్పుడు, టీకాల పట్టికలో కూడా మార్పులు, చేర్పులు జరుగుతాయి. ఉదాహరణకు.. ఒకప్పుడు తప్పకుండా ఇచ్చే వ్యాధి నిరోధక స్మాల్ పాక్స్ టీకా ఇప్పుడు ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇవ్వడం లేదు. కారణం, ఈ వ్యాధిని ఇప్పటికే విశ్వవ్యాప్తంగా నిర్మూలించ గలిగాం. పిల్లల టీకాల రికార్డును జాగ్రత్తగా భద్రపరచాలి. దీనివల్ల ఎప్పుడు ఏ టీకా ఇప్పించిందీ, ఇంకా ఇప్పించాల్సిన వాటి వివరాలేమిటనేది బాగా గుర్తుంటుంది. కొన్నిసార్లు పాఠశాల ప్రవేశానికి, విదేశీ ప్రయాణానికి ఆ పత్రాలు చూపించాల్సి రావచ్చు.
–డాక్టర్ కర్రా రమేష్‌రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

