Tomato Ketchup | టమాటా కెచప్‌తో వెంటాడే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..!
మనలో చాలా మందికి స్నాక్స్ తీసుకునే సమయంలో టమాట కెచప్ (Tomato Ketchup ) పక్కన ఉండాల్సిందే. డిష్ ఏదైనా టమాట కెచప్‌తో తీసుకోవడం చూస్తుంటాం.
న్యూఢిల్లీ : మనలో చాలా మందికి స్నాక్స్ తీసుకునే సమయంలో టమాట కెచప్ (Tomato Ketchup ) పక్కన ఉండాల్సిందే. డిష్ ఏదైనా టమాట కెచప్‌తో తీసుకోవడం చూస్తుంటాం. టమాట కెచప్ రుచితో పాటు వంటకాల టేస్ట్‌ను కూడా పెంచుతుంది. అయితే బయట స్టోర్స్‌లో టమాట కెచప్స్ను కొనుగోలు చేసి వాడటం మంచిది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. స్టోర్‌లో తీసుకున్న టమాటా కెచప్ వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్ పొంచిఉంటాయని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రిచా గంగాని సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించారు.
రిటైల్ స్టోర్స్‌లో దొరికే టమాట కెచప్‌లో రుచిని, రంగును జోడించేందుకు పలు కెమికల్స్, యాడిటివ్స్ను జోడిస్తారని రిచా గంగాని చెప్పుకొచ్చారు. ఇవి వివిధ రకాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటిలో అధికంగా షుగర్, సాల్ట్, ఫ్రక్టోజ్, ప్రిజర్వేటివ్స్, కార్న్ సిరప్ కలిసిఉండటంతో శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆమె వివరించారు. టమాటా కెచప్‌లో కేవలం 20 శాతం మాత్రమే నిజమైన టమాటాలను వాడతారు.
మిగిలినదంతా షుగర్, ప్రిజర్వేటివ్స్ కావడంతో వీటిని అధిక మొత్తంలో తీసుకుంటే అజీర్తి, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, వికారం వంటి సైడ్ఎఫెక్ట్స్ పొంచిఉంటాయి. వాణిజ్యపరంగా రూపొందించే టమాట కెచప్స్లో అధిక మోతాదులో షుగర్, సాల్ట్, కార్న్ సిరప్ వాడటంతో బరువు పెరిగే అవకాశం ఉంది. టమాటా కెచప్స్ను తరచూ తీసుకుంటే మధుమేహ ముప్పు తప్పదని న్యూట్రిషనిస్ట్ రిచా గంగాని హెచ్చరించారు. టమాటాలు, డేట్స్‌తో ఇంట్లోనే టమాటా కెచప్‌ను తయారుచేసుకుంటే అనారోగ్యాల బారినుంచి తప్పించుకోవచ్చని ఆమె చెబుతున్నారు.
Read More :
Teachers Day | మనిషిని పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దే క్రాంతి ప్రదాతలు ఉపాధ్యాయులు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

