పుచ్చును ఆపే ద్రవం
చిన్నారుల పళ్ల విషయంలో ప్రధానమైన సమస్య పుచ్చిపోవడం. దీనివల్ల దంతాల్లో రంధ్రాలు ఏర్పడతాయి. చికిత్సలో భాగంగా చిగుళ్లకు ఇంజెక్షన్లు ఇవ్వడం, డ్రిల్లింగ్ చేయడంలాంటి నొప్పిని కలిగించే విధానాలు ఉంటాయి. ఇవేవీ లేకుండా కేవలం ఒక ద్రవంలాంటి పదార్థాన్ని పంటి మీద పెయింట్లా పూయడం ద్వారా సెకన్లలోనే ఇన్ఫెక్షన్ని అరికట్ట వచ్చని ఒక సరికొత్త పరిశోధన తేల్చింది.
చిన్నారుల పళ్ల విషయంలో ప్రధానమైన సమస్య పుచ్చిపోవడం. దీనివల్ల దంతాల్లో రంధ్రాలు ఏర్పడతాయి. చికిత్సలో భాగంగా చిగుళ్లకు ఇంజెక్షన్లు ఇవ్వడం, డ్రిల్లింగ్ చేయడంలాంటి నొప్పిని కలిగించే విధానాలు ఉంటాయి. ఇవేవీ లేకుండా కేవలం ఒక ద్రవంలాంటి పదార్థాన్ని పంటి మీద పెయింట్లా పూయడం ద్వారా సెకన్లలోనే ఇన్ఫెక్షన్ని అరికట్ట వచ్చని ఒక సరికొత్త పరిశోధన తేల్చింది. అమెరికాలోని మిషిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 6 ఏండ్లలోపు ఉండే 830 మంది పిల్లల మీద చేసిన ఈ పరిశీలన గురించి ఇటీవల ప్రముఖ మెడికల్ జర్నల్ జామా ప్రచురించింది.
సిల్వర్ డయామిన్ ఫ్లోరైడ్
(ఎస్డీఎఫ్) అనే ద్రవ రూపంలోని మందును దూది సాయంతో పుచ్చిన పన్నులోపలా బయటా రాసి కొద్ది సేపు ఉంచితే చాలు పన్ను ఇక పుచ్చడం ఆగిపోతుంది. ఇందులోని సిల్వర్.. పన్నులోని ఇన్ఫెక్షన్తో పోరాడితే, ఫ్లోరైడ్ పంటిని దృఢంగా ఉంచేందుకు సాయపడతుంది. ఏడాది పిల్లలకు కూడా దీన్ని వాడటం సురక్షితమేనని ఇందులో పాల్గొన్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరింత పరిశోధన జరిగితే పెద్ద ఎత్తున దీన్ని అందుబాటులోకి తీసుకురావచ్చని వీళ్లు భావిస్తున్నారు. ఇది ముందుకు వస్తే ఇక తీవ్రమైన నొప్పి లేకుండానే పుచ్చుపళ్లకి చికిత్స అందించవచ్చన్న మాట!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

