Healthy Food | ఈ పండ్లు తింటే అన్ని లాభాలా?

National nutrition week | పోషకాహారలోపంతో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఈ సమస్య వెంటాడుతున్నది. ముఖ్యంగా చిన్నారులు, గర్భవతుల్లో పోషకాహార లోపం అధికంగా నమోదవుతున్నదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఆరోగ్యంగా జీవించడానికి విటమిన్స్ సమృద్ధిగా ఉన్న ఆహారం చాలా కీలకం. చాలా మందికి పోషక విలువలపై అవగాహన లేక నిర్లక్ష్యం చేస్తున్నారు. కరోనా, డెంగీ లాంటి రోగాలు వచ్చినప్పుడు ఇమ్యూనిటీ లేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోషక విలువల ప్రాధాన్యతను తెలుసుకుని ఆరోగ్యంగా జీవించాలంటూ ఎన్ఐఏన్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) సెప్టెంబర్ నెలను ‘నేషనల్ న్యూట్రిషన్ మాసం’గా నిర్వహిస్తున్నది.

పండ్ల ఉపయోగాలపై సూచనలు…
- మామిడి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జలుబు, దగ్గును తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల రోగాలు రాకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది.
- బొప్పాయిలో విటమిన్-ఏ, సీ అధికంగా ఉంటాయి. జలుబు, ఫ్లూలు రాకుండా అడ్డుకుంటుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- పుచ్చకాయలో ఏ,సీ విటమిన్ అధికంగా ఉంటంది. రోగ నిరోధక శక్తి పెంచి శరీరానికి చలువను అందిస్తుంది.
- కర్జూర.. తెల్లరక్తకణాలను పెంచుతుంది. రోగ నిరోధక శక్తి వస్తుంది.
- నిమ్మలో విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించే రక్తహీనతను తగ్గిస్తుంది.
- బత్తాయిలో విటమిన్-సీ అధికంగా ఉంటుంది. వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
- జామలో విటమిన్-సీ ఉండటంతో వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
- అరటిలో విటిమిన్- బీ-6 అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ఇంట్లోనే తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.ముఖ్యంగా విటమిన్లు లభించే ఫుడ్‌ను ప్రిఫర్ చేయాలి. విటమిన్-డీ, సీ,బీలను సమృద్ధిగా తీసుకోవాలి. వృద్ధులలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి రాగి జావ తాగించాలి. రోజువారి ఆహారంలో తాజా పండ్లు ఉండేలా చూసుకోవాలి. పసుపు నారింజ రంగులో ఉండే పండ్లు కొన్ని రకాలు ధీర్ఘకాలిక జబ్బులను నిరోధిస్తాయి. తాజాగా ఉండే పచ్చి కూరగాయలను, పండ్లను సలాడ్ రూపంలో తీసుకుంటే మంచిది. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
– సనా ఫాతిమా, న్యూట్రీషనిస్ట్, రివ క్లినిక్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పల్లెల్లో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ అవుతున్న డయాబెటిస్ రోగులు.. ఎందుకంటే..
Child Health | మీ పిల్లలు నులిపురుగులతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా నివారించండి
Vaccines for children | మీ పిల్లలకు ఈ టీకాలు ఇప్పించారా?
Childhood obesity | ఆన్లైన్ క్లాసులతో లావెక్కుతున్న చిన్నారులు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

