Millet Recipes : 2023ను అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించిన క్రమంలో రోజువారీ ఆహారంలో మిల్లెట్స్ వినియోగం పెరిగింది. మిల్లెట్స్ బరువు తగ్గడంలో, హైబీపీ నియంత్రణలో ఉపయోగపడతాయని వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహారోత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహక అథారిటీ (అపెడా) పేర్కొంది.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగినందున మిల్లెట్స్ మధుమేహ ముప్పునూ తగ్గిస్తాయి. మిల్లెట్స్‌లో ఐరన్, జింక్, క్యాల్షియం వంటి పోషకాలతో పాటు ఫైబర్ అధికంగా ఉండటంతో మలబద్ధకం సమస్యనూ నివారిస్తాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే మిల్లెట్స్‌ను లంచ్‌లో భాగం చేసుకుంటే అది టేస్టీ ఆప్షన్‌తో పాటు ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఇక కుట్టు పిండి అని పిలుస్తారు. గోధుమపిండికి ప్రత్యామ్నాయంగా దీన్ని వాడతారు. ఈ పిండితో రొట్టెలు,దోసలు వంటి వాటిని చేసుకొని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పిండిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండటంతో పాటు ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఈ పిండిని సూపర్ ఫుడ్‌గా చెబుతారు. ఇక లంచ్‌కు మెరుగైన మిల్లెట్ వంటకాలను పరిశీలిస్తే..
కుట్టు దోశ
రాజ్గిరా కధి
సజ్జ కిచిడి
జొన్న ఉప్మా
రాగి లడ్డూ
Read More :