మైక్రో వర్కవుట్లు.. ఆరోగ్యాగానికి ఎంతో మేలు
నేటి బతుకు పోరాటంలో అనారోగ్యాల పాలవుతున్నారు ప్రజలు. దీంతో ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని ఉన్నా గంటలకొద్దీ సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో మైక్రో వర్కవుట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వ్యాయామ నిపుణులు చెబుతున్నారు. ఈ మైక్రో వర్కవుట్లు ఇలా చేద్దాం.
వ్యాయామం
జీవితం చాలా బిజీగా మారిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ.. క్షణం తీరిక లేకుండా గడిచిపోతున్నది. ఇలాంటి సమయంలో.. పార్కులు, జిమ్‌లో ఓ 60 నిమిషాలు గడపడం కూడా అసాధ్యంగా మారిపోతున్నది. ఇలాంటప్పుడు ‘మైక్రో-వర్కవుట్లు’ ఎంతో సహాయ పడతాయని వ్యాయామ నిపుణులు చెబుతున్నారు. కేవలం రెండు నుంచి 10 నిమిషాలపాటు సాగే అత్యంత సమర్థమైన వ్యాయామాలను వివరిస్తున్నారు. వీటిని క్రమంతప్పకుండా చేయడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుందనీ, గుండె ఆరోగ్యం బలపడుతుందనీ అంటున్నారు.
కార్డియో మైక్రో-వర్కవుట్లు
రెండు నిమిషాలు: ఇల్లు, ఆఫీస్‌లోని మెట్లు ఎక్కుతూ, దిగుతూ.. రెండు నిమిషాలపాటు నడవండి. ఓపిక ఉంటే పరిగెత్తండి.
మూడు నిమిషాలు: మోకాళ్లను పైకి ఎత్తుతూ.. 20 సెకన్ల పాటు మార్చింగ్ లేదా రన్నింగ్ చేయండి. ఆ తర్వాత 10 సెకన్లు విశ్రాంతి తీసుకోండి. ఇలా మొత్తం ఆరు రౌండ్లు చేయండి.
ఐదు నిమిషాలు: ఒక్కో నిమిషం చొప్పున జంపింగ్ జాక్స్, హై నీస్, మౌంటెయిన్ క్లయింబర్స్, స్క్వాట్స్, సైడ్ కిక్ అవుట్స్ చేయండి.
స్ట్రెంత్ ట్రైనింగ్ కోసం..
రెండు నిమిషాలు: మొదటి నిమిషం ఎయిర్ స్క్వాట్స్ లేదా కుర్చీ నుంచి లేవడం, రెండో నిమిషం రివర్స్ లంగ్స్ లేదా ట్యాప్ బ్యాక్స్ చేయండి.
మూడు నిమిషాలు: 45 సెకన్ల పాటు కౌంటర్ పుష్-అప్స్ చేసి, 15 సెకన్లు విశ్రాంతి తీసుకోండి. దీనిని మూడుసార్లు పునరావృతం చేయండి.
ఐదు నిమిషాలు: ఒక్కో నిమిషం చొప్పున.. స్క్వాట్స్ లేదా చైర్ స్టాండ్స్; నేలపైన, కౌంటర్‌పై లేదా గోడపై పుష్-అప్స్; రివర్స్ లంగ్స్ లేదా ట్యాప్-బ్యాక్స్; ఫోర్-ఆర్మ్ ప్లాంక్; చివరగా వాల్ సిట్ చేయండి.
అలవాట్లతో కలిపేయండి..
మీ రోజువారీ పనులు, అలవాట్లతో.. వ్యాయామాన్ని కలిపేయండి. కాఫీ తయారయ్యేలోపు 10 పుష్-అప్స్ చేయండి. లేదా ప్రతి జూమ్ మీటింగ్ తర్వాత ఓ మూడు నిమిషాలు మెట్లు ఎక్కి దిగండి. డెస్క్ ఉద్యోగాలు చేసేవారు.. ప్రతి గంటకూ ఒకసారి లేచి శరీరాన్ని స్ట్రెచ్ చేసుకోండి. ఇందుకోసం మీ ఫోన్లో అలారం సెట్ చేసుకోండి.
వైతాళికుల వాణి
విలువలు పాటించని వ్యక్తులు అనే మాటలకు ఏ విలువా ఉండదు. – అరిస్టాటిల్, తత్వవేత్త
క్యా సీన్ హై!

Cartoon
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

