Magic mushrooms | డిప్రెషన్లో ఉన్నారా..? అయితే, ఈ ఫుడ్ ట్రై చేయండి..!
Magic mushrooms | కోపం, నిరుత్సాహం, బాధ, ఓటమి.. ఇలాంటి భావోద్వేగాలు మనల్ని ఎక్కువ కాలం పాటు వేధిస్తే.. దానిని డిప్రెషన్‌గా పరిగణించాలి. మ్యాజిక్ మష్రూమ్స్ అని పిలిచే ఒక రకం పుట్టగొడుగులు చాలా ప్రభావవంతంగా ఉంటాయని...
Magic mushrooms | సెలబ్రిటీలు డిప్రెషన్‌కు గురైన వార్తలు ఇటీవల తరచుగా మనం వింటున్నాం. సామాన్యులు మొదలు సినిమా నటుల వరకు ఎందరో డిప్రెషన్ బారిన పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్యల్లో డిప్రెషన్ ముందు వరుసలో ఉన్నది. చాలా మంది డిప్రెషన్ బారిన పడ్డామంటూ చెప్తుంటారు. నిజానికి డిప్రెషన్ అంటే ఏంటి..? నార్మల్ ఎమోషన్స్‌కి తేడా ఏమైనా ఉన్నదా..? అనేది చాలా ముఖ్యమైనవి.
కోపం, నిరుత్సాహం, బాధ, ఓటమి.. ఇలాంటి భావోద్వేగాలు మనల్ని ఎక్కువ కాలం పాటు వేధిస్తే.. దానిని డిప్రెషన్‌గా పరిగణించాలి. మన దేశ జనాభాలో 20 శాతం మంది ఏదో ఒకసారి డిప్రెషన్ బారిన పడినట్లు గణాంకాలు చెప్తున్నాయి. చిన్న విషయానికే చిరాకుగా ఉండటం, ఇష్టమైన పనులు కూడా నచ్చకపోవడం, మనుషులకు దూరంగా ఉండాలని అనిపించడం, నిద్ర పట్టకపోవడం, నిస్సత్తువగా అనిపించడం, ఆకలి తగ్గిపోవడం, తలనొప్పి వేధిస్తుండటం.. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు.
ఇలాఉండగా, డిప్రెషన్ నుంచి బయటపడేందుకు మ్యాజిక్ మష్రూమ్స్ అని పిలిచే ఒక రకం పుట్టగొడుగులు చాలా ప్రభావవంతంగా ఉంటాయని ఇటీవలి ఒక అధ్యయనంలో తేలింది. ఈ రకం పుట్టగొడుగుల్లో ఉండే సైలోసిబిన్ అనే సైకెడెలిక్ పదార్థం డిప్రెషన్‌పై ప్రభావం చూపుతుందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలోని సెంటర్ ఫర్ సైకెడెలిక్ రీసెర్చ్ అధ్యయనకారులు పేర్కొన్నారు.
డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్న దాదాపు 60 మంది రోగుల మెదడును స్కాన్ చేసి ఈ పరిశోధన నిర్వహించారు. చికిత్స ప్రభావాలను ఉత్పత్తి చేసేందుకు సైలోసిబిన్ ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని గుర్తించినట్లు అధ్యయనపత్రంలో వెల్లడించారు.
మ్యాజిక్ మషరూమ్లలో మొదడును రీసెట్ చేసే ఉత్ర్పేరకాలు ఉన్నట్లు తాజా పరిశీలనల్లో స్పష్టమైంది. పుట్టగొడుగుల్లో ఉండే సైలోసిబిన్ అనే పదార్థం డిప్రెషన్ రోగుల మెదడులో మంచి మార్పులు తీసుకొచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. సైలోసిబిన్ ఇవ్వక ముందు, ఇచ్చిన తర్వాత వారి మెదళ్లను స్కాన్ చేసి రెండు కీలక మార్పులను కనుగొన్నారు.
పుట్టగొడుగులను తినేవారిలో డిప్రెషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఒక నివేదిక తెలిపింది. అందుకే మానసిక ఆరోగ్యం కోసం పుట్టగొడుగులను వారంలో ఒకసారైనా తినాలని ఆహారనిపుణులు ప్రోత్సాహిస్తుంటారు. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు, విటమిన్లు, ఖనిజాలతోపాటు ఎర్గోథియోనినన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవే యాంటీ డిప్రెసెంట్లుగా పనిచేసి మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

