Health tips : ఇలా చేస్తే ఊపిరితిత్తులకు ఊతం!

శరీరంలో కీలక అవయవమైన ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఆరోగ్యకరమైన జీవనానికి అత్యంత అవసరం.మన శ్వాసకోశ వ్యవస్ధలో అంతర్భాగమైన లంగ్స్‌ను సవ్యంగా పనిచేసేలా చూసుకోవాలి. ఇవి ఒక్కసారి దెబ్బతింటే వాటిని ఆరోగ్యకరంగా, మునుపటి స్ధితికి తీసుకురావడం కష్టసాధ్యమైనందున వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి.
ఊపిరితిత్తులను దెబ్బతీసే అలవాట్లను మానుకోవాలి. ముఖ్యంగా పొగతాగడం అలవాటు ఉంటే తక్షణమే మానివేయాలి. పొగతాగని వారితో పోలిస్తే పొగతాగేవారిలో లంగ్ క్యాన్సర్ ముప్పు అధికం. లంగ్ క్యాన్సర్‌తో పాటు ఆస్త్మా, బ్రాంకైటిస్, సీఓపీడీ వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు ఈ అలవాటు దారితీస్తుంది. కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎక్స్పోజ్ కావడం తగ్గించాలి. అత్యవసరమైతే బయటకు వెళ్లే సమయంలో మాస్కులు, ఫేస్‌షీల్డ్ ధరించాలి.
ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లంగ్స్‌కు హానికలిగించే ఫంగస్, ఇతర సూక్ష్మక్రిములు దరిచేరకుండా శుభ్రత పాటించాలి. ఎప్పటికప్పుడు ఊపిరితిత్తుల ఆరోగ్యం పరీక్షించుకునేందుకు వైద్యనిపుణులతో చెకప్ చేయించుకుని అవసరమైతే మందులు, చికిత్స తీసుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

