Regular Exercise : మెదడుకు అకస్మాత్తుగా రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడినప్పుడు స్ట్రోక్ ముప్పు తలెత్తుతుంది. రక్తసరఫరాలో బ్లాకేజ్ (ఇస్కిమిక్ స్ట్రోక్), బ్లీడింగ్ (హమరేజిక్ స్ట్రోక్) వంటి సమస్యలతో స్ట్రోక్ ముంచుకొస్తుంది.
ఈ సందర్భాల్లో మెదడుకు ఆక్సిజన్, పోషకాల సరఫరా నిలిచిపోవడంతో మెదడు దెబ్బతినడం, మెదడు కణాలు దెబ్బతినడం జరుగుతుంది. స్ట్రోక్స్ ప్రాణాంతకమే కాకుండా దాని ప్రభావం మెదడు, శరీర అవయవాలపై తీవ్రంగా ఉంటుంది. ఇది స్ట్రోక్ ఎక్కడ తలెత్తింది, బ్రైన్ డ్యామేజ్ ఏ మేరకు జరిగిందనే దానిపై అది చూపే ప్రభావ తీవ్రత ఆధారపడి ఉంటుంది.
అయితే నిత్యం వ్యాయామం చేసేవారిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు స్ట్రోక్ ముప్పును కూడా నివారించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా మెదడు సహా శరీర భాగాలన్నింటికీ రక్తసరఫరా మెరుగుపడుతుంది. నిత్య వ్యాయామంతో స్ట్రోక్ ముప్పును తగ్గించే కారకాలను పరిశీలిస్తే..
వ్యాయామంతో గుండె ఆరోగ్యం మెరుగు
బరువు నియంత్రణ
బీపీ నియంత్రణ
అదుపులో మధుమేహం
కొలెస్ట్రాల్ బ్యాలెన్స్
రక్త సరఫరా మెరుగుదల
వాపు ప్ర్రక్రియకు చెక్
ఒత్తిడి మటుమాయం
నూతన కణాలతో రక్తసరఫరా మెరుగుదల
Read More :
Deer | వనం వీడి జనంలోకి జింక.. డీర్ పార్క్‌కు తరలించిన అధికారులు